Jukkal: దోస్త్‌పల్లి నుంచి నానీజ్ ధామ్ వరకు 26 రోజుల పాదయాత్ర
Jukkal: కామారెడ్డి జిల్లా దోస్త్‌పల్లి నుంచి మహారాష్ట్ర నానీజ్ ధామ్ వరకు ప్రారంభం కానున్న 26 రోజుల ఆధ్యాత్మిక భక్తి పాదయాత్ర.
Jukkal: దోస్త్‌పల్లి నుంచి నానీజ్ ధామ్ వరకు 26 రోజుల పాదయాత్ర
జుక్కల్: జుక్కల్ (కామారెడ్డి )కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలందోస్త్‌పల్లి–బంగారుపల్లి గ్రామ శివారులోని దక్షిణ భారత్ పీఠాధిపతి జగద్గురు స్వామి శ్రీ నరేంద్రాచార్యజీ మహారాజ్ తెలంగాణ ఉప పీఠంనుంచిమహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా నానీజ్ ధామ్ శ్రీ క్షేత్ర రామానంద విభాగం వరకు 26 రోజుల భక్తి పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఉప పీఠం నిర్వాహకులు తెలిపారు.
ఆదివారం ఉదయం తెలంగాణ ఉప పీఠంనుంచిమంగళవాయిద్యాలు, భజనలు, నామస్మరణల మధ్య పాదయాత్ర ఘనంగా ప్రారంభం కానుంది. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని పలు పవిత్ర ప్రాంతాల మీదుగా ఈ యాత్ర 26 రోజుల పాటు కొనసాగి, చివరి రోజు నానీజ్ ధామ్ చేరుకుని జగద్గురు స్వామి శ్రీ నరేంద్రాచార్యజీ మహారాజ్ ఆశీర్వాదాలుపొందనున్నారు.
ఈ పాదయాత్రలో పాల్గొనే భక్తులు 26 రోజుల పాటు భగవన్నామ స్మరణ, భజనలు, ధ్యానం, సేవా భావంతో ఆధ్యాత్మిక ప్రయాణం సాగించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ యాత్ర అధ్యాత్మిక, సామాజిక చైతన్య భక్తి, ధర్మం, సనాతన సంప్రదాయాల పట్ల ఆత్మీయ అనుబంధాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ పాదయాత్ర ద్వార పర్యావరణ పరిరక్షణ పెరుగుతున్న గ్లోబల్ వర్మింగ్ (భూమి ఉష్ణోగ్రత పెరుగుదల ) పై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు.ఈ పవిత్ర పాదయాత్రలో భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, భక్తి భావంతో నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని విస్తరించాలని నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.




