Kamareddy: కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల విత్తన మేళా
Kamareddy: కామారెడ్డి జిల్లా రైతు వేదికల్లో 3 రోజుల విత్తన మేళా ప్రారంభం. ఎల్నినో ప్రభావంతో తక్కువ కాలపరిమితి గల వరి విత్తనాలు సాగుచేయాలని అధికారుల సూచన.
Kamareddy: కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల విత్తన మేళా
కామారెడ్డి జిల్లా: విత్తన మేళ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని రైతు వేదికల్లో మూడు రోజుల పాటు విత్తన మేళా నిర్వహిస్తున్నారు.
కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ అధికారి దేవేంద్ర రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు.
తక్కువ కాల వ్యవధిలో దిగుబడి ఇచ్చే, ప్రభుత్వం బోనస్ ప్రకటించిన ఏడు రకాల వరి విత్తనాలనే సాగు చేయాలని రైతులకు సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో ఇవి రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. మార్కెట్‌లో నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వం గుర్తింపు పొందిన కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన విత్తనాల రసీదులను తప్పనిసరిగా భద్రపరుచుకోవాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.




