Nizamabad: బోధన్ లో రేషన్ బియ్యం కలకలం.. 35 క్వింటాళ్ల బియ్యం సీజ్!


Nizamabad: బోధన్ లో రేషన్ బియ్యం కలకలం.. 35 క్వింటాళ్ల బియ్యం సీజ్!
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత! మహారాష్ట్రకు తరలిస్తున్న 35 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని సీజ్ చేసిన పోలీసులు.
నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలో సోమవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నుండి బోధన్ మీదుగా మహారాష్ట్ర వైపు వెళుతున్న TS01U5527 గల వాహనంలో సుమారు 35 క్వింటాళ్ల 50 కిలోల పిడిఎస్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పక్కా నిఘా ఏర్పాటు చేసి వాహనాన్ని పట్టు కున్నామన్నారు. వాహనాన్ని జప్తు చేయగా 35 50 కిలోల బియ్యం రవాణా జరుగుతున్నట్లు వెల్లడైందన్నారు. నిజామాబాద్ పట్టణం నుండి తరచు పిడిఎఫ్ బియ్యం రవాణా జరుగుతున్నట్లు ఆరోపణ సైతం ఉన్నాయి. పట్టుకున్న బియ్యాన్ని ఎమ్మెల్యే పాయింట్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ వెలడించారు.
అక్రమ బియ్యం రవాణాకు బోధన్ కేంద్రం: పట్టణ తో పాటు రుద్రూర్, వర్ని, కోటగిరి మండల కేంద్రాల్లోని పలు రైస్ మిల్లల నుండి పిడిఎస్ బియ్యం రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేదలకు సన్నబియానందిస్తున్న ప్రభుత్వం సన్న బియ్యం అక్రమ బియ్యం వ్యాపారస్తులు గ్రామాలలో పర్యటిస్తూ ఆటోలు,మోపెళ్ళపై లబ్ధిదారుల వద్ద తక్కువ ధరకు సేకరిస్తున్నట్లు తెలిసింది. లబ్ధిదారులకు క్వింటాకు 2000 చెల్లించి మిల్లర్లకు ఏజెంట్లు సరఫరా చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
రేషన్ డీలర్ల కీలకపాత్ర: అక్రమ బియ్యం రవాణా విషయంలో పలు ప్రాంతాల్లో కొందరురేషన్ డీలర్లు సైతం కీలక పాత్ర పోషిస్తున్నట్లు విమర్శలు లేకపోలేదు. కొందరు భూస్వాములు వ్యాపారస్తుల రేషన్ కార్డులను తమ వద్ద ఉంచుకొని వారి వేలి ముద్రలను సేకరించి డీలర్లు అక్రమ వ్యాపారానికి తరలిస్తున్నట్లు తెలుస్తుంది.
మామూళ్ల మత్తులో సివిల్ సప్లై అధికారులు: సివిల్ సప్లై అధికారుల నిఘా కొరవడంతో అక్రమంగా రేషన్ బియ్యం తెలంగాణ నుండి మహారాష్ట్రకు తర్లుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. పలు రైస్ మిల్లర్ల వద్ద కొందరు అధికారులు మూడు పూలు తీసుకోవడంతో బియ్యం దందా జోరుగా కొనసాగుతుందని గ్రామాల్లో కోడే కూర్చున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

