Bichkunda: బిచ్కుంద ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Bichkunda: బిచ్కుందలో ఏబీవీపీ 78వ ఆవిర్భావ వేడుకలు. దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవీపీ కొనసాగుతోందని కన్వీనర్ చరణ్ పేర్కొన్నారు. భారీ ర్యాలీ నిర్వహణ.
Bichkunda: బిచ్కుంద ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బిచ్కుంద: బిచ్కుంద (కామారెడ్డి) 1949 వ సంవత్సరం లో ప్రారంభమైన ఎ పి వి పి (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు 80 లక్షల సభ్యత్వంతో దేశంలో అతిపెద్ద ఆర్గనైజేషన్ గా ఈ విద్యార్థి పరిషత్ కొనసాగుతుందని ఎ బి వి పి రాష్ట్ర కేలో భారత్ కన్వీనర్ చరణ్ తెలిపారు.
ఎ బి వి పి ఆవిర్భవించి 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79 సంవత్సరాలలో అడుగు పెడుతున్న కారణంగా గురువారం బిచ్కుంద పట్టణం లోని ఎ బి వి పి బిచ్కుంద శాఖ ఆధ్వర్యంలో ఎ బి వి పి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బిచ్కుంద పట్టణంలోని ప్రధాన విధులలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేస్తూ సమస్య పరిష్కారం కోసం తమ విద్యార్థి పరిషత్ విద్యార్థులకు అండగ నిలుస్తోందని నగర అధ్యక్షుడు ముప్పడి వెంకట్ పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులను కూడగట్టి పోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమం లో నగర కార్యదర్శి నాగరాజ్, ఎస్ ఎఫ్ డి కన్వీనర్ సందీప్, నగర ఉపాధ్యక్షుడు రాహుల్, శ్రీకాంత్, హర్ష తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.




