Nizamabad: తెలంగాణ వర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర: ఏబీవీపీ ఆందోళన!

Nizamabad: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్సిటీ గేటు ముందు ఏబీవీపీ సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించింది.

M. RAMESH,NIZAMABAD
Published on: 8 Sept 2026 11:17 PM IST
Nizamabad
X

Nizamabad: తెలంగాణ వర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర: ఏబీవీపీ ఆందోళన!

నిజామాబాదు: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) - తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందు సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ABVP తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు సమీర్, మోహన్ మాట్లాడుతూ "కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది.

ఫీజులు కట్టలేక పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు కాలేజీల నుండి బయటకు వెళ్లగొట్టబడుతున్నారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ బిల్లులు చెల్లించక తిండి కూడా పెట్టని దుస్థితి నెలకొంది. 6 గ్యారెంటీల పేరుతో మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను పూర్తిగా విస్మరించింది. ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం.

పెండింగ్‌లో ఉన్న రూ. 14 వేల కోట్లకు పైగా స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం" అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ప్రాంత వనవాసి కన్వీనర్ అశోక్ ,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ శివ,వైస్ ప్రెసిడెంట్ విజయ్,లెనిన్,అనిల్ జాయింట్ సెక్రటరీ విఘ్నేష్ ,కిరీటి,రాజేందర్ కార్యకర్తలు పవన్ ,రామకృష్ణ,ఆశ్విత్,టిల్లు,కిరణ్ ప్రీతం,నితిన్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story