Bichkunda: బిచ్కుందలో ఏఐసెక్ట్ (AISECT) జిల్లా కార్యాలయం ప్రారంభం!

Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రొమైండ్స్ స్కిల్ క్యాటలిస్ట్ (AISECT) జిల్లా కార్యాలయం ప్రారంభం.

VEERANNA, JUKKAL
Published on: 22 Aug 2026 12:11 PM IST
Bichkunda
X

Bichkunda: బిచ్కుందలో ఏఐసెక్ట్ (AISECT) జిల్లా కార్యాలయం ప్రారంభం!

Bichkunda: బిచ్కుంద కామారెడ్డి జిల్లాలో నైపుణ్యభివృద్ధి, విద్య రంగానికి మరొక ముఖ్యమైన అడుగు పడింది. దేశంలో ప్రముఖ నైపుణ్యభివృద్ధి సంస్థ AISECT తన నూతన భాగస్వామ్య విధానం PMS 2.0 లో భాగంగా బిచ్కుంద పట్టణంలో ప్రొమైండ్స్ స్కిల్ క్యాటలిస్టును కామారెడ్డి జిల్లా అధికారిక AISECT జిల్లా కార్యాలయంగా ఎంపిక చేసింది.

ఈ సందర్బంగా బిచ్కుంద పట్టణం లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా యువతకు నైపుణ్య శిక్షణ, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను ఒక వేదికపై అందించనున్నట్లు సంస్థ ప్రతినిధి కె. గంగాధర్ తెలిపారు.ప్రొమైండ్స్ స్కిల్ క్యాటలిస్ట్ బిచ్కుంద ను జిల్లా కేంద్రంగా అధికారిక AISECT జిల్లా కార్యాలయంగా ఎంపిక చెయ్యడం ద్వార విద్యార్థులు, నిరుద్యోగ యువత తోపాటు ఉద్యోగస్థులకు ఒకే వేదికపై నైపుణ్యభివృద్ధి, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, కేరిర్ మార్గదర్శకత్వంఅందించనున్నట్లు సంస్థ హెడ్ కె. గంగాధర్ తెలిపారు.

కంప్యూటర్ కోర్సులు, డిజిటల్ స్కిల్, స్పోకెన్ ఇంగ్లిష్, పర్సనలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, ట్యాలీ ఆర్టిపిషయల్ ఇంట్లిజెన్స్,రోబోటిక్స్,ఎంప్లయాబిలిటీ స్కిల్ వంటి ఉద్యోగోపయోగి శిక్షణ కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగానిర్వహించనున్నట్లు చెప్పారు.

అదేవిధంగా డిగ్రీ, పిజీ, డిప్లొమా, డిస్టెన్స్ తోపాటు ఆన్లైన్ విద్య అవకాశాలు కూడ అందుబాటులోకితీసుకురానున్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యభివృద్ధి పథకాల ద్వారా అర్వులైన యువతకు ఉచిత శిక్షణ, సర్టిఫికేషన్, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

పాఠశాలల కోసం ప్రొమైండ్స్ ఫ్యూచర్ స్కిల్స్ ల్యాబ్ కార్యక్రమం ద్వారా రోబోటిక్, AI, కోడింగ్ కమ్యూనికేషన్ మరియు లైఫ్ స్కిల్స్,వంటి భవిష్యత్ నైప్యూణ్యలను విద్యార్థుల కు పరిచయం చెయ్యనున్నట్లు సంస్థ హెడ్ కె. గంగాధర్ పేర్కొన్నారు.

బిచ్కుంద పట్టణంలో AISECT జిల్లా కార్యాలయం ఏర్పాటు కావడం ద్వారా కామారెడ్డి జిల్లాలో నైపుణ్యభివృద్ధి, డిజిటల్ విద్య తోపాటు ఉపాధి అవకాశాలకు కొత్త దిశ ఏర్పాడుతుందని స్థానికులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story