Alur: గ్రామపంచాయతీ ఆవరణలో రచ్చ.. మహిళా భవన్ పనుల నిలిపివేత.. రంగంలోకి పోలీసులు!

Alur: ఆలూరు మండలం గ్రామపంచాయతీ ఆవరణలో మహిళా సంఘ భవన నిర్మాణ పనుల వద్ద ఉద్రిక్తత. సర్పంచ్, ఎంపీడీవో ఆధ్వర్యంలో పనులు ప్రారంభించగా జేసీబీని అడ్డుకున్న స్థానిక ఇంటి యజమానులు.

VAMSHI, ARMOOR
Published on: 8 Jun 2026 4:43 PM IST
Alur
X

ఆలూరులో టెన్షన్: మహిళా సంఘ భవనం పనుల వద్ద ఘర్షణ.. జేసీబీకి అడ్డంగా నిలిచిన స్థానికులు!

ఆలూరు: జిల్లా కేంద్ర ఆలూరు మండల్ గ్రామ గ్రామపంచాయతీ స్థల ఆవరణలో మహిళా సంఘం భవనం కోసం పనులు ప్రారంభించబడినది.

గ్రామంలో ఇటీవల గెలిచిన సర్పంచ్ చార్జ్ తీసుకున్న తర్వాత, మహిళా భవనానికి నిధులు సాంక్షన్ కావడంతో, గ్రామపంచాయతీ ఫండ్స్ మహిళా భవనానికి నిర్మాణానికి రావడంతో ఆవరణలో ప్రభుత్వం ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం సర్పంచ్, సెక్రెటరీ, ఆలూరు ఎంపీడీవో ఆధ్వర్యంలో ముగ్గు పోసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత, జెసిపి తీసుకొని మెజర్మెంట్స్ లో తువ్వడంతో అక్కడ ఉన్న ఇంటి యజమానులు మీరు ఏ రకంగా దొబ్బుతారు అంటూ, జెసిపికి అడ్డం రావడం జరిగింది.

ప్రభుత్వం మా గ్రామానికి మహిళా భవనానికి నిధులు కేటాయించడంతో, మా V. D. C నెంబర్లు, సంఘ మహిళలతో కలిసి భవనాన్ని ఒప్పందంతో సంఘ మహిళల, సర్పంచ్ ఉప సర్పంచ్, ఎంపీడీవో, ఏ. ఇ. ఆధ్వర్యంలో ఈరోజు కొబ్బరికాయ కొట్టి భవన పనులు ప్రారంభించాము.

నేను మహిళా భవన పనులు నిర్వహించేటప్పుడు అక్కడ ఉన్న ఇంటి వారు, భవనం పనులు ప్రారంభించకుండా జెసిపి ని అడ్డుకోవడం జరిగింది, అక్కడ ప్రభుత్వ అధికారులు ఎంపీడీవో,ఏ ఈ పనులు ప్రారంభించుకోమని చెప్పిన తర్వాత కూడా, అక్కడ ఉన్న ఇంటి యజమానులు ఘర్షణకు దిగారు. ఈ వాగ్వాదంతో వీడిసి మెంబర్లు పోలీసులను ఆశ్రయించారు. సుమారు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చేదాకా భవన పనులు ఆగిపోయాయి.

నేను సర్పంచ్ గా గెలిచిన తర్వాత, మా ఊరికి మహిళా భవనం లేని సందర్భంగా, ఇప్పుడు మహిళా భవన్ కొరకు నిధులు రావడంతో, గ్రామపంచాయతీ ఆవరణలో వచ్చిన నిధులతో మహిళా భవనానికి కేటాయించి ఈరోజు పనులను ప్రభుత్వ అధికారుల, గ్రామ ఉప సర్పంచ్ సెక్రెటరీ, VDC పర్యవేక్షణలో పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నాము, అక్కడ ఉన్న ఇంటి వారు, వారికి వీరరకంగా దారి ఉన్నా గాని, మీరు ఏ రకంగా ఇక్కడ నిర్మిస్తారు మేము చూస్తాం అంటూ జెసిబికి అడ్డం రావడం జరిగింది, ఊరు అభివృద్ధి కోసమే ఒక సర్పంచ్ గా నేనున్నానంటూ హెచ్ఎంటీవీ ద్వారా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీడిసి మెంబర్లు, గ్రామ ప్రజలు, సంఘ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story