Alur: ఆలూర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొట్టిన లారీ!

Alur: నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం జరిగింది.

VAMSHI, ARMOOR
Published on: 29 May 2026 3:21 PM IST
Alur
X

Alur: ఆలూర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఢీకొట్టిన లారీ!

Alur: జిల్లా కేంద్ర ఆలూరు మండల్ ఆలూర్ గ్రామ అంబేద్కర్ విగ్రహానికి రాత్రి 11 గంటలకు ఢీ కొట్టిన గుర్తుతెలియని నల్ల మట్టి లారీ. గ్రామంలో రాత్రి 11 గంటలకు అధిక హెవీ లోడ్ నల్ల మట్టి తో వస్తున్న గుర్తుతెలియని లారీ అంబేద్కర్ విగ్రహాన్ని గద్దెను బలంగా ఢీకొట్టడంతో, ఉదయం అంబేద్కర్ విగ్రహం గద్దెను గమనించిన స్థానికులు ఒకేసారి చూడడంతో, దళిత సంఘ నాయకులు& సర్పంచ్ అక్కడికి చేరుకొని, ఈ సందర్భంగా సర్పంచ్ విజయ్ మాట్లాడుతూ లారీ లు ఆర్మూర్ వైపు నుండి అతివేగంతో వచ్చిన ఒక లారీ అర్ధరాత్రి వేళ ఆలూర్ ప్రధాన చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విగ్రహం కింది సిమెంట్ గద్దె, రక్షణ గ్రిల్స్ పూర్తిగా ధ్వంసమై, విగ్రహం కూలిపోయే స్థితికి చేరింది. సంఘాల నాయకులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి భారీ వాహనాలను నిలిపివేశారు. మితిమీరిన వేగంతో వెళ్లే లారీలను అదుపు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై రజినీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకొని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు.

అసలు హెవీ లోడ్ నల్ల మట్టి ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి:

నల్ల మట్టి హెవీ లోడ్ టిప్పర్లు & లారీ లు సుమారు రోజుకు 100కు పైగా ఉమ్మేడ దగ్గర్లో ఉన్న ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతం నుంచి భారీ పెద్ద జెసిపి ల సాయంతో నల్ల మట్టి తరలింపు వివిధ గ్రామాలకు కొనసాగుంటుంది, ఈ యొక్క లారీలు అక్కడినుంచి భారీ హెవీ లోడ్ తో రావడంతో రోడ్డుపై మట్టి పాడేమీ కాకుండా, కొన్ని ఊర్లకు వెళ్లాలంటే మధ్య మధ్యలో గ్రామాల్లో చిన్న రోడ్లు ఉండడంతో, గ్రామస్తులకు చాలా బాధాకరంగా ఉంది, అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా కొనసాగుతుందంటున్న ఆలూరు గ్రామస్తులు, ఇప్పుడు అంబేద్కర్ కి విగ్రహానికి గద్దే ధ్వంసం కావడంతో విషయం కాస్త నల్లమట్టి వ్యవ్వారం బయటకు వచ్చింది, ఇటీవల ఓ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నల్ల మట్టి విషయంపై స్పందించి లోడ్ ఎక్కకాకుండా, సమానంగా తీసుకెళ్లి దారిలో కొన్ని గ్రామాలు ఉంటాయి కాబట్టి, లారీ టిప్పర్లు మెల్లగా నడుపుతూ వెళ్లాలని సూచించారు, ఎవరైనా వెహికల్స్ ఫాస్ట్ పైన చొ, అధిక లోడుతో పోయినచో అధికారులు వారిపైచర్య తీసుకోవాలని కోరారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story