Armoor: రెడ్డి కాలనీలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి ఇంటింటా భజన

Armoor: అర్మూర్ రెడ్డి కాలనీలో ఘనంగా అయ్యప్ప స్వామి ఇంటింటా భజన కార్యక్రమం. పాల్గొన్న మణికంఠ సేవా సమితి సభ్యులు, గురుస్వాములు.

VAMSHI, ARMOOR
Published on: 11 Sept 2026 8:59 PM IST
Armoor
X

Armoor: రెడ్డి కాలనీలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి ఇంటింటా భజన

అర్మూర్: ఆర్మూర్ పట్టణ మున్సిపల్ పరిధి రెడ్డి కాలనీలో బుధవారం సందర్భంగా సాయంత్రం అయ్యప్ప స్వామి ఇంటింటా భజన కార్యక్రమం , మణికంఠ సేవా సమితి, అర్చకులు నాగేష్ శర్మ ఆధ్వర్యంలో కర్తన్ నవీన్ స్వామి ఇంట్లో, అయ్యప్ప స్వామికి, హారతి, భజన కార్యక్రమం అనంతరం అల్పాహారం నిర్వహించారు.

అర్చకులు నాగేష్ శర్మ మాట్లాడుతూ:

ఈ సందర్భంగా నగేష్ శర్మ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ సిద్దుల గుట్ట అయ్యప్ప దేవాలయంలో పైన ప్రతి నెల ఒకటి బుధవారం అయ్యప్ప స్వామి కి అభిషేకం కార్యక్రమంలో, ఇంటింటి అయ్యప్ప భజన కార్యక్రమం పోస్టర్ ని మణికంఠ సేవా సమితి, అయ్యప్ప ఆలయ కర్త అయ్యప్ప శీను చేతుల మీదుగా విడుదల చేశారు,

దీని భాగంగా ప్రతి నెలలో ఒక్కొక్క బుధవారం ఒకరి ఇంట్లో సాయంకాలం అయ్యప్ప పూజ భజన నిర్వహించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ, ఈరోజు కర్తన్ నవీన్ ఇంట్లో అయ్యప్ప పూజ నిర్వహించారు, వచ్చే బుధవారం 16/9/26) తారీక్ నాడు ఇల్లెందుల. సురేష్ చారీ స్వామి ఇంట్లో ఈ భజన కార్యక్రమం సాయంకాలం నిర్ణయించబడినది, కావున అయ్యప్ప స్వామి భక్తులు, ఈ భజన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై , విజయవంతం చేయాలని కోరుతున్నాను, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏

ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి అధ్యక్షుడు చేపూరి. ధనంజయ్, ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షుడు కౌటిక విజయ్, కోశాధికారి సురేష్ చారి, ప్రచార కార్యదర్శి గంగా మోహన్, సలహాదారులు, శ్రీహరి గురు స్వామి,

కృష్ణ గురుస్వామి, శుభమ్ స్వామి, షేద్ ఒడ్డెన్న గురుస్వామి, మహేష్ స్వామి, నవీన్ స్వామి, రమణయ్య స్వామి, సుధీర్ స్వామి , గంగాధర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR