Armoor: మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన వినతిపత్రం అందజేత
Armoor: అర్మూర్ మున్సిపాలిటీలో కుక్కలు, కోతుల బెడదపై బీజేపీ నేతలు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
Armoor: మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన వినతిపత్రం అందజేత
అర్మూర్: ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడు, కౌన్సిలర్ ఆధ్వర్యంలో , మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
బిజెపి పట్టణ అధ్యక్షుడు : బాలు
ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు మందుల బాలు మాట్లాడుతూ పట్టణ అన్ని వార్డులలో, కుక్కలు, కోతుల బెడద, చాలా ఉండడంతో , మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసి, కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తెలుసుకోవడం జరిగింది, ఈరోజు లాగే గతంలో కూడా ఎన్నిసార్లు ఈ విషయం పై వారి దృష్టికి తీసుకువచ్చిన గాని , ఎలాంటి పరిష్కారం లేదు, కేవలం కొన్ని వార్డులలో కుక్కలను పడుతున్నాం అని చెప్పి , ఫోటోలు పెట్టి, ఇష్టను సారంగా మున్సిపల్ లో బిల్లులు ను చూపిస్తూ బిల్లులు ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది.
మున్సిపల్ చైర్మన్, కమిషనర్ వాటా, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వాటా ఎంత అంటూ, ముఖ్యంగా వాట దారులుగా ఉండి, మేము ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది కుక్కల వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి, మన ఆర్మూర్ ప్రాంతంలో వదులుతుండ్రు, అవి అలా చేయడం వల్ల, చిన్నపిల్లలకు, దివ్యాంగులకు, వృద్ధులకు బయటకు వెళ్లాలంటే భయం ఆందోళన కలుగుతుంది, కొన్ని ఏరియాలలో పిల్లలు స్కూల్ పంపియం లేడు, ఆడుకొని కూడా పంపియడం లేదు, ఇదొక చెత్త మున్సిపాలిటీ, చెత్త బండ్లు మైంటైన్ చేయలేని మున్సిపాలిటీ గా తయారయింది.
కమిషనర్ గాని,చైర్మన్ గాని మేము చర్యలు తీసుకుంటున్నామంటూ, మాకు సమాధానం చెప్పడం జరుగుతుంది, బడ్జెట్ రూపంలో మింగడం మాత్రం చూపిస్తున్నారు, సాక్షాత్తుగా మొన్న మొరం విషయంలో మా బిజెపి కౌన్సిలర్ అందరూ, గుమ్మ కుడి,కౌన్సిలర్ కమిషనర్ను కోరగా, ఓకే పంపిస్తామంటూ, కేవలం కాంగ్రెస్ కౌన్సిలర్లకి 30,40 ట్రిప్పులు పంపిస్తూ, బిజెపి పార్టీ కౌన్సిలర్లకు ఒకటి రెండు పంపిస్తున్నారు, ఇకనైనా మాకు కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ గానే మా కౌన్సిలర్లకు సమానంగా చూడాలంటూ, లేని పక్షాన మున్సిపల్ కార్యాలని పెద్ద ఎత్తున ముట్టడిస్తామంటూ మాట్లాడాడు.
బిజెపి కౌన్సిలర్ దొండి - కవిత - ఈశ్వర్ :
బిజెపి కౌన్సిలర్ దొండి కవిత - ఈశ్వర్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ కు,చైర్మన్ కు, గతంలో ఉన్న కమిషనర్ కు పదేపదే చెప్తున్నాను, మా వార్డ్ యొక్క సమస్య, గత ఏడు నెలల నుంచి ఇలాగే చెబుతుంటే వస్తున్నాము, మున్సిపల్ నుంచి ఎలాంటి పరిష్కారం లేదు, ఇకనైనా మా వార్డ్ లో ఉన్న కుక్కలను, కోతులను వెంటనే మున్సిపల్ అధికారుల, కార్మికులను పంపించి అవి వెంటనే తొలగించాలంటూ కోరుతూ, వార్డులలో చిన్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు లాంటి ప్రజలు ఉన్నారు, మున్సిపల్ అధికారులు లేట్ చేసిన తో కుక్కలు కరవడంతో మా ప్రజలకు అనేక సమస్యలతో గురవుతాదంటూ, ఈ పరిష్కారాన్ని త్వరగా పరిష్కరించకుంటే మేము పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ మాట్లాడారు.
వార్డులకు మొరం విషయంలో :
ఈ విషయంపై పట్టణ అధ్యక్షుడు బిజెపి కౌన్సిలర్లు మాట్లాడుతూ, మేము మొన్న ఇటీవలే కౌన్సిలర్లు అంతా, కమిషనర్ను చైర్మన్ ను కలవడం జరిగింది, మా వార్డు ప్రజలకు సరైన రోడ్ లేక, రోడ్డుపై పెద్ద పెద్ద లొంతలు ఉండడంతో, మా వార్డులలో మొరం ఏపీయాలంటూ అడగడం జరిగింది, కమిషనర్ - చైర్మన్ ఓకే స్పందిస్తామంటూ, ఓపి ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది బిజెపి కౌన్సిలర్లకు, కౌన్సిలర్లు దాన్ని నమ్మి వెనుకకి వెళ్లారు.
తీరా చూస్తే కేవలం కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డులకే 30 నుంచి 40 ట్రిప్పులు పోపించి, బిజెపి కౌన్సిలర్లకు రెండు లేదా మూడు ట్రిప్పులు పోపించి , మేము అన్ని వార్డులలో మొరం పంపించినామని తల ఊపుతున్నారు , ప్రజలు మాకు ఓటేసి న్యాయంగా గెలిపించుకున్నారు, కావున మా వార్డుల కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ లాగా సమానంగా బిజెపి కౌన్సిలర్లని చూడాలంటూ బిజెపి పట్టణ శాఖ తరపున పట్టణ అధ్యక్షుడు,కౌన్సిలర్లు డిమాండ్ చేశారు, లేనియెడల బిజెపి కార్యకర్తలు నాయకులతో అంతా కలిసి పెద్ద ఎత్తున కార్యాలయాన్ని ముట్టడిస్తామని మీడియముకంగా చెప్పడం జరిగింది.
పట్టణ మున్సిపల్ కమిషనర్ కు :
పట్టణంలో 36 వార్డ్ లు మున్సిపల్ కమిషనర్ కు కేవలం కొన్ని వార్డ్ లే అభివృద్ధి కోసం కళ్ళకు కనిపిస్తున్నాయా అంటున్న బిజెపి కౌన్సిలర్లు, ఇకనైనా మీ పనితీరు మార్చుకోవాలంటున్న కౌన్సిలర్లు, లేని పక్షాన ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ మందుల బాలు, బిజెపి టౌన్ సెక్రెటరీ పి. శ్రీధర్, బిజెపి ఓపిసి మోర్చా అధ్యక్షుడు కిరణ్ కుమార్, బిజెవైమ్ టౌన్ ప్రెసిడెంట్ ఉదయ్ గౌడ్, బిజెపి ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ రాజశేఖర్, బిజెపి కౌన్సిలర్లు చిచ్చు శ్రవణ్ కుమార్, దొండి కవిత ఈశ్వర్, పాన్ శీను, పోచంపాడ్ శ్రీనివాస్, ఖందేశ్ ప్రశాంత్, పొట్టు రాజు, మనిషి, లక్కీ తదితరులు పాల్గొన్నారు.




