Armoor: బోరు మోటార్ రిపేర్ చేస్తూ కరెంట్ షాక్‌తో మెకానిక్ మృతి!
Armoor: ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్‌లో బోరు మోటారు రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై పన్నీరు శ్రీనివాస్ (46) అనే బోర్ మెకానిక్ మృతి
Armoor: బోరు మోటార్ రిపేర్ చేస్తూ కరెంట్ షాక్‌తో మెకానిక్ మృతి!
ఆర్మూర్ న్యూస్: ఆర్మూర్ పట్టణ పెర్కిట్ లో ని బోర్ మెకానిక్ గా పనిచేసే వ్యక్తి అయిన పన్నీరు శ్రీనివాస్ s/o చిన్నయ్య, వయసు: 46yrs , ఉదయం అందజా 11 గం :30 నిమిషాలకు అల్లూరి నాగరాజు పొలం లో బోరు మోటారు రిపేరు పని చేయడానికి వెళ్లగా అక్కడ రిపేరు చేస్తుండగా మృతి చెందాడు.
పన్నీర్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఉదయం 11:30 గంటలకు ఓ రైతు పొలానికి రిపేర్ చేయడానికి వెళ్లగా అక్కడ స్టార్టర్ డబ్బా కి ఉన్న సర్వీస్ వైరు నుండి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలగా పక్కనే ఉన్న నాగభూషణం అనే వ్యక్తి కర్రతో కొట్టి కాపాడి వెంటనే చికిత్స కొరకు ఆర్మూర్ లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కి తరలించగా అక్కడ డ్యూటీ లో ఉన్న డాక్టర్ పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.
ఇట్టి విషయము పైన మృతుడి కూతురు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరపడం జరిగింది.




