Armoor: ఆర్మూర్‌లో బీఆర్ఎస్ సభ్యత్వ సన్నాహక సమావేశం
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సభ్యత్వ సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది.
Armoor: ఆర్మూర్‌లో బీఆర్ఎస్ సభ్యత్వ సన్నాహక సమావేశం
Armoor: బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సభ్యత్వ సన్నాహక సమావేశ ఆర్మూర్ పట్టణ ఓ ఫంక్షన్ హాల్ లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ మాజీ మంత్రి & బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వి.జి గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంతు సిండే, గణేష్ గుప్తా పాల్గొన్నారు.
నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే& జిల్లా పార్టీ అధ్యక్షుడు : ఆశన్న గారి జీవన్ రెడ్డి.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు & ఆర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీ ఆర్ఎస్ పార్టీ అంటే ఎవరికీ భయపడని రాష్ట్ర పార్టీ, బీ ఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఈ యొక్క సభ్యత్వాన్ని విజయవంతం చేయాలంటూ గత 2013 సంవత్సరం అక్షయ తృతీయలో ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమై, ఈ పార్టీ నుంచి ఆరోజు మొదటి సీట్ ఇస్తే, బీ ఆర్ఎస్ పార్టీ అధికారం కు వచ్చింది, కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, మేము కూడా ఎమ్మెల్యేలు అయ్యాము, జిల్లాలోని మొట్టమొదటిగా SIR సన్నాహక కార్యక్రమం, నిజాంబాద్ జిల్లా కు ఓ చరిత్ర ఉంది,
మొట్టమొదటిగా గ్రీన్ ఇన్క్ ఇచ్చింది, రాబోయే జిల్లాలో 9 మంది అసెంబ్లీ ఎన్నికలు గెలిసి మళ్లీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ రాష్ట్రానికి అంటూ ఈ సమావేశంలో తెలియచేస్తున్నారు, నియోజవర్గ బిజెపి ఎమ్మెల్యే ప్రజలకు అక్షంతలు పంచి గెలిచారు,బీజేపీ నియోజవర్గ ఎమ్మెల్యే, జిల్లా ఎంపీ ఇద్దరు ఉన్నారు, వరి ధాన్యాన్ని మునుగోలు చేస్తలేరు, ఈ విషయంపై ఎప్పుడు కూడా మాట్లాడరు, ప్రజలకు రైతులకు సమస్య వచ్చినప్పుడు, బిజెపి పార్టీ ఎంపీ మంది ఎంపీలు ఉండి కూడా ఎలాంటి ప్రయోజనం లేక పోతుంది, కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఒకటే అంటూ మన జిల్లాకు బిజెపి ఎంపీ ఉండి కూడా, ప్రజలకు రైతులకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు, ఇకనైనా ప్రజలపై రైతులపై దయ చూపి, జిల్లాలో ఉన్న రైతుల ధాన్యాన్ని మొత్తం కొనేలా చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొని వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, రూలర్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమాన్ సిండే, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆలూరు టిఆర్ఎస్ నాయకురాలు భారతి రెడ్డి,నియోజవర్గ టిఆర్ఎస్ నూతన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.




