Armoor: ఆర్మూర్ అభివృద్ధికి వినయ్ కుమార్ రెడ్డి కృషి.. మంత్రికి వినతిపత్రం అందజేత

Armoor: ఆర్మూర్ అభివృద్ధి కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసి వినతిపత్రం అందించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.

VAMSHI, ARMOOR
Published on: 24 April 2026 1:32 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ అభివృద్ధికి వినయ్ కుమార్ రెడ్డి కృషి.. మంత్రికి వినతిపత్రం అందజేత

ఆర్మూర్: నందిపేట్ పోరం సర్పంచ్లు, నియోజవర్గ ఇన్చార్జ్ కాంగ్రెస్ పార్టీ వినయ్ రెడ్డి తో పాటు తెలంగాణ మంత్రి ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ శాఖ మాత్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ ని కలిసి పలు అభివృద్ధి ల కోసం వినతి పత్రం అందజేశారు.

1.నందిపేట్ మండల కేంద్రంలో ఎస్సీ

హాస్టల్ కాంపౌండ్ వాల్ మంజూరు చేయాల్సిందిగా..

2.ఐలాపూర్ గ్రామానికి ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు హాస్టల్ మంజూరు చేయాల్సిందిగా

3.ఆర్మూర్ పట్టణంలో కోటి రూపాయలతో నాలెడ్జ్ హబ్ సెంటర్ ఐదు మండలాలకి ఒక్కో మండలంలో నాలెడ్జ్ హబ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని మంత్రి కి విన్నవించి వినతి పత్రం సమర్పించిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి..

దానికి వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా మంజూరు చేయిస్తానని వాగ్దానం చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నందిపేట్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు సిలిండర్ లింగం, నందిపేట్ మండల గ్రామాల సర్పంచులు లక్ష్మీనారాయణ, శ్రీకాంత్, సాయి కుమార్, దేవేందర్ దేవదాసు, ముత్యం, నవీన్, మహమూద్, హనుమాన్,సుదన్, జీవన్, తదితర సర్పంచులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story