Armoor: ఆర్మూర్ నియోజకవర్గంలో బడిబాట సంబరాలు

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని నందిపేట్ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.

VAMSHI, ARMOOR
Published on: 17 Jun 2026 1:32 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ నియోజకవర్గంలో బడిబాట సంబరాలు

Armoor: జిల్లా కేంద్ర నందిపేట్ మండల్ చిమ్రాజ్ పల్లి, డొంకేశ్వర్ మండల్ గంగసముందర్ పలు గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పుస్తకాలను చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం పాఠశాలలో నిర్వహించారు.

చీమ్రాజ్ పల్లి గ్రామ సర్పంచ్:

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాజెండ్ల లావణ్య - మురళి మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వ ప్రవేశపెట్టిన పుస్తకాలను పాఠశాలలో పిల్లల పంపిణీ చేస్తూ, ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ చక్కగా ఉపాధ్యాయులు చెప్పిన పాటలను విని, మంచి శ్రద్ధతో పరీక్షలు పెట్టేటప్పుడు మంచిగా గుర్తు చేసుకొని రాయాలన్నారు, మన పాఠశాలకి మంచి ర్యాంకు తీసుకొచ్చి జిల్లాలోనే మొదటి ర్యాంకుగా తీసుకురావాలని పిల్లలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ నరేందర్, హెడ్మాస్టర్ కిషన్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

గంగాసముందర్ గ్రామ సర్పంచ్:

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ పిల్లలు మంచిగా చదువుకొని, పాఠశాలలో ప్రవేశపెట్టిన పరీక్షాలని ఆలోచించి ప్రశ్నకు జవాబు మంచిగా రాయాలంటూ, పాఠశాలలో పిల్లలు మంచి ర్యాంకులు తెచ్చుకొని ఉపాధ్యాయులకు, తండ్రి తండ్రులకు మంచి మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ పిల్లలకు సూచిస్తూ చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, గ్రామ వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story