Armoor: ఆర్మూర్ కోర్టులో మెగా ఉచిత వైద్య శిబిరం!

Armoor: ఆర్మూర్ కోర్టులో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, నిజామాబాద్ మెడికవర్ సంయుక్తంగా మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాయి.

VAMSHI, ARMOOR
Published on: 13 Oct 2026 4:44 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ కోర్టులో మెగా ఉచిత వైద్య శిబిరం!

ఆర్మూర్ న్యూస్ అక్టోబర్ 13: మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఆర్మూర్ మరియు నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్, సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్ న్యాయస్థాన సముదాయంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ వైద్య శిబిరంలో మెడికవర్ హాస్పిటల్స్‌కు చెందిన వైద్యులు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మాలు ఆనంద్ నందకిషోర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ చంద్రబోస్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మణిదీప్ రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ శరణ్య పాల్గొని వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సలహాలు అందించారు.

సుమారుగా 200 మంది వైద్య శిబిరంలో భాగంగా రక్తపోటు (బీపీ), ఈసీజీ, 2డి ఎకో తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తగిన వైద్య సూచనలు చేశారు. గుండె సంబంధిత సమస్యలు, ఎముకలు మరియు కీళ్ల సమస్యలు, మహిళల ఆరోగ్య సమస్యలపై వైద్యులు అవగాహన కల్పించారు.

ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని ఈ సందర్భంగా ముఖ్యఅతిథి శ్రీమతి పి శ్రీదేవి, సీనియర్ సివిల్ జడ్జి మరియు చైర్పర్సన్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ తెలిపారు. న్యాయస్థాన సిబ్బందికి ఆరోగ్య సేవలను అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం ఉపయోగకరంగా నిలిచింది.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR