Armoor: తొండాపూర్‌లో డివిజనల్ పంచాయతీ అధికారి పర్యటన
Armoor: ఆర్మూర్ నియోజకవర్గం డొంకేశ్వర్ మండలం తొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని డీఎల్‌పీఓ శివకృష్ణ శనివారం పరిశీలించారు.
Armoor: తొండాపూర్‌లో డివిజనల్ పంచాయతీ అధికారి పర్యటన
Armoor: నియోజవర్గ డొంకేశ్వర్ మండల్ తొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్ణయిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని డి ఎల్ పి ఓ శివకృష్ణ పరిశీలించారు.
డి ఎల్ పి ఓ శివకృష్ణ మాట్లాడుతూ:
గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ పరిశీలించి, ఇంకో పెండింగ్ లో గాని ఉన్న పనులు, త్వరలో పూర్తి చేయిస్తానని గ్రామ సర్పంచ్ కు హామీ ఇచ్చాడు, ఇప్పటిదాకా జరిగిన విషయాలపై గ్రామ సర్పంచ్ అల్లూరి గంగారెడ్డి తో వివరాలు తెలుసుకున్నారు.
ఈ గ్రామానికి, గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు తో, చక్కగా గ్రామపంచాయతీని అభివృద్ధి చేస్తానని, మిగతా పనుల కోసం పై అధికారులతో మాట్లాడతానని హెచ్ఎంటివి ద్వారా తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగారెడ్డి, ఉప సర్పంచ్ షేక్ మజారుద్దీన్, పంచాయతీ సెక్రెటరీ అనిల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.




