Armoor: విద్యుత్ వైర్లు విప్పుతూ పట్టుబడ్డ విద్యుత్ సిబ్బంది
Armoor: ఆర్మూర్ శ్రీరాంపూర్‌లో రాత్రి వేళ కరెంట్ వైర్లు విప్పుతున్న ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను సర్పంచ్, గ్రామస్తులు పట్టుకున్నారు. ఉన్నతాధికారుల విచారణకు డిమాండ్.
Armoor: విద్యుత్ వైర్లు విప్పుతూ పట్టుబడ్డ విద్యుత్ సిబ్బంది
అర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ విద్యుత్ లైన్మెన్ రాజశేఖర్ రెడ్డి, జూనియర్ లైన్మెన్ అరుణ్ లు పెర్కిట్ ఏరియా శివారులోని శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఆఫ్ చేసి విద్యుత్ కరెంటు పోల్స్ కు సంబంధించిన విద్యుత్ వైర్లను విప్పారు.
బుధవారం రాత్రి 10 గంటల తర్వాత పెరికిటీ ఏరియాలోని శివారు గ్రామమైన శ్రీరాంపూర్ గ్రామ పరిసరాలకు వెళ్లి విద్యుత్ పోల్స్ కరెంటు వైర్లను విప్పుతుండగా శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ నల్లగొండ పద్మ ఎర్రన్న ఆ గ్రామస్తులతో కలిసి పట్టుకున్నారు.
మా గ్రామంలోకి వచ్చి విద్యుత్ వైర్లను కరెంటు స్తంభాల నుంచి ఎందుకు విప్పుతున్నారని ప్రశ్నించి ఆ విప్పిన విద్యుత్ వైర్లను శ్రీరాంపూర్ గ్రామంలో పెట్టుకున్నారు. విద్యుత్ ఉద్యోగులు విప్పిన విద్యుత్ వైర్లను, విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన ఎన్పీడీసీఎల్ ప్రభుత్వ ఐడి కార్డులను శ్రీరాంపూర్ సర్పంచ్ నల్లగొండ పద్మ ఎర్రన్న, గ్రామస్తులు కలిసి వారి దగ్గర పెట్టుకున్నారు.
ఈ విషయమై గురువారం దిశ ప్రతినిధి శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ నల్లగొండ పద్మ ఎర్రన్నతో మాట్లాడారు. మా గ్రామంలోకి వచ్చి పక్క గ్రామస్తులైన పెర్కిట్ కు చెందిన విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ కరెంటు ఫోన్లకు సంబంధించిన వైర్లను ఇప్పుతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. విద్యుత్ వైర్లు విప్పుతున్న ఆ ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించగా మేము విద్యుత్ వైర్లను విప్పడం తప్పే, విప్పిన వైర్లను విప్పడం వాస్తవమే, కరెంట్ పోల్స్ నుండి విప్పిన వైర్లను యధావిధిగా మళ్లీ బిగిస్తామని గురువారం ఉదయం వచ్చి విద్యుత్ ఉద్యోగులైన రాజశేఖర్ రెడ్డి, అరుణ్ లు ఒక నలుగురు వ్యక్తులను తోలుకొని వచ్చి మాతో మాట్లాడి విద్యుత్ వైర్లను బిగించినట్లు సర్పంచ్ నల్లగొండ పద్మ నరసయ్య తెలిపారు.
పెరికిట్లో విద్యుత్ అధికారులుగా పనిచేస్తున్న సదరు ఇద్దరు వ్యక్తుల పనితీరుపై పెరికిట్ ఏరియాకు చెందిన పలువురు రైతులు ఈ చిన్న పని పడ్డ భారీగా ఆమ్యామ్యాలు దండుకొని దే పనులను చక్కబెట్టేవారు కాదని రైతులు ఆరోపించారు. ఏది ఏమైనా ఇద్దరు విద్యుత్ ఉద్యోగులపై ఉన్నత విద్యుత్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే నిజా నిజాలు బయటపడతాయని పెర్కిట్ కు చెందిన పలువురు రైతులు పేర్కొంటున్నారు.




