Armoor: తాండలో ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశానికి సర్పంచ్ రాథోడ్ శ్రీకాంత్
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూర్ మండలం దుర్గానగర్ కింది తండాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.
Armoor: తాండలో ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశానికి సర్పంచ్ రాథోడ్ శ్రీకాంత
ఆర్మూర్ న్యూస్: జిల్లా కేంద్ర ఆర్మూర్ నియోజవర్గం మాక్లూర్ మండల్ దుర్గా నగర్ కింది తండా గ్రామంలో నేనావత్ సుశీల w/o: హొసింగ్ ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి రాథోడ్ శ్రీకాంత్ పాల్గొని, ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశానికి వారి కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేశారు.
ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ దంపతులు: ఈ సందర్భంగా నేనావత్ సుశీల వారి భర్త ఆయన హొసింగ్ మాట్లాడుతూ మా పై దయ చూపి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించినందుకు ముఖ్యంగా మా గ్రామ సర్పంచ్ అయినా యువకుడు రాథోడ్ శ్రీకాంత్ కి ముఖ్య కృతజ్ఞతలు తెలుపుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తరపున వచ్చిన ఇందిరమ్మ ఇల్లు పథకం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులకు, నియోజవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి కే వారి కుటుంబ సభ్యులు అంతా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ సర్పంచ్ రాథోడ్ శ్రీకాంత్: ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాథోడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ మన గ్రామంలో ఇంకా ఎవరైనా గాని, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు, ప్రభుత్వ ఇచ్చిన సూచనలతో ఎవరైనా ఉంటే, నన్ను మన గ్రామపంచాయతీలు సంప్రదిస్తే, ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ రెండో విడతలో, ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లుకు పెట్టినా అర్హతలు ఉన్నవారు, కావలసినవారు మన గ్రామపంచాయతీ లో నాకు గాని సెక్రెటరీకి కలిసినతో, ఇందిరమ్మ ఇల్లుకు ఇచ్చిన పత్రాలను పరిశీలించి, ఇచ్చిన వారిలో అర్హత ఉన్నవారికి కంపల్సరీ ఇప్పిస్తానంటూ గ్రామ ప్రజలకు హామీ ఇస్తూ, అనంతరం గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా గాని నన్ను సంప్రదించాలంటూ, నిరంతరం గ్రామం కోసమే నా సేవ అని చెప్తూ, ఇంకా మన గ్రామ అభివృద్ధి కోసం నేను ముందుండి, నాకు అభివృద్ధి లక్షమంటూ ముందుకు వెళ్తానంటూ గ్రామ ప్రజలకు హెచ్ఎంటీవీ ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది.




