Armoor: జక్రాన్‌పల్లి పంచాయతీ కార్యదర్శి డిప్యూటేషన్ వివాదం
Armoor: జక్రాన్‌పల్లి పంచాయతీ కార్యదర్శి రంజిత్ కుమార్‌ను డిప్యూటేషన్‌పై పంపే యత్నాలపై వివాదం. జక్రాన్‌పల్లిలోనే కొనసాగించాలని ఉన్నతాధికారులకు వినతి.
Armoor: జక్రాన్‌పల్లి పంచాయతీ కార్యదర్శి డిప్యూటేషన్ వివాదం
ఆర్మూర్: ఆర్మూర్ డివిజన్ పరిధిలోని జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి డిప్యూటేషన్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సాధారణ బదిలీపై జక్రాన్‌పల్లికి వచ్చిన పంచాయతీ కార్యదర్శి సౌడ రంజిత్ కుమార్‌ను మరో ప్రాంతానికి డిప్యూటేషన్‌పై పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శి పార్వతి రాజేశ్వర్ ఈ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో, సాధారణ బదిలీపై వచ్చిన ఉద్యోగిని తిరిగి మరో ప్రాంతానికి డిప్యూటేషన్‌పై పంపించే ప్రయత్నాలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సౌడ రంజిత్ కుమార్‌ను జక్రాన్‌పల్లిలోనే కొనసాగించాలని, డిప్యూటేషన్ ప్రతిపాదనను రద్దు చేయాలని కోరుతూ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు జిల్లా ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సౌడ రంజిత్ కుమార్ తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలిపారు,తాను జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి వచ్చి కేవలం నాలుగు నెలలే అవుతోందని పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలోనే తనను మరో ప్రాంతానికి డిప్యూటేషన్‌పై పంపించే ప్రయత్నాలు చేయడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ప్రస్తుతం పనిచేస్తున్న స్థానంలోకి మరో కార్యదర్శిని డిప్యూటేషన్‌పై తీసుకురావడం,తన పనితీరును పరిగణనలోకి తీసుకొని, డిప్యూటేషన్‌ను రద్దు చేసి జక్రాన్‌పల్లిలోనే కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
*దళిత ఉద్యోగికి న్యాయం చేయాలని విజ్ఞప్తి....! *
తాను దళిత కుటుంబానికి చెందిన వ్యక్తినని పేర్కొంటూ, తనకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు స్పందించాలని సౌడ రంజిత్ కుమార్ కోరినట్లు సమాచారం. ఉద్యోగుల పనితీరు, నిబంధనలు, పరిపాలనా అవసరాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు? డిప్యూటేషన్‌ను రద్దు చేసి సౌడ రంజిత్ కుమార్‌ను జక్రాన్‌పల్లిలోనే కొనసాగిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.




