Armoor: బాలికల ఆటస్థలంపై కబ్జాదారుల కన్ను.. రంగంలోకి అధికారులు
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ గ్రౌండ్‌లో 26 గుంటల భూమి కబ్జాకు గురైంది.
Armoor: బాలికల ఆటస్థలంపై కబ్జాదారుల కన్ను.. రంగంలోకి అధికారులు
Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్ర మున్సిపల్ పరిధి ఎవడో వార్డులో లో ఏర్పాటు చేసిన తెలంగాణ సర్వ శిక్ష అభియాన్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఆవరణలో ఉన్న గ్రౌండ్ ని కబ్జా చేశారు.
విద్యాలయంలో ఎంత కబ్జా చేశారు:
ఈ బాలిక విద్యాలయ ఆవరణాలో ఉన్న గ్రౌండ్ లో ఉన్న స్థలం సుమారు 26 గుంటల ల్యాండ్ ను కబ్జా చేశారు, ఈ విద్యాలయంలో ఉన్న బాలికలకు స్పోర్ట్స్ ఆడుకోనికి గ్రౌండ్ గా చాలా బాగుంటుంది, ఇలా కబ్జా చేయడంతో ఈ స్కూల్ కి బాలికలు ఆడుకోనికి గ్రౌండ్ అనేది లేకుండా ఉంటుంది.
కబ్జా చేసిన వారిపై అధికారులకు ఫిర్యాదు:
ఈ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ జన్నాపల్లి రంజిత్ s/o: ఎర్రిన్న, జర్నలిస్ట్ కాలనీ నివాసం ఆర్మూర్ వెంటనే గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అక్కడ కబ్జా చేసిన దానిపై విద్యాలయ ప్రిన్సిపల్ ని అడిగి తెలుసుకున్నాడు, ఇలా కబ్జా చేసుడు కరెక్ట్ కాదంటూ , సబ్ కలెక్టర్కు వినతిపత్రం చేశాడు.
స్పందించిన రెవెన్యూ అధికారులు:
రంజిత్ విద్యాలయంలో 26 గుంటలో ల్యాండ్ కబ్జా చేశారని సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేయగానే, వెంటనే అధికారులు స్పందించి ల్యాండ్ సర్వేయర్ , ఆ కబ్జా చేసిన ల్యాండ్ దగ్గరికి వచ్చి, అక్కడున్న ఫెనసింగ్ రౌతులను అధికారులు తీసివేశారు, ఈ ఫెన్సింగ్ వైర్ ని తీసివేసిన తర్వాత, మల్ల అధికారం చేతిలో ఉందని, కబ్జాదారులు వచ్చి చేస్తారో ముందు ముందు ఏమవుతుందో వేచి చూడాల్సింది.
స్పందించిన అధికారుల వివరణ:
ఎవరైనా గాని ఎక్కడ ల్యాండ్ కబ్జా చేసినా గానీ, అది మా దృష్టికి వచ్చినతో, ఆ ల్యాండ్ ని పరిశీలించి ఇది పక్కా కబ్జానా లేదా, ల్యాండ్ నెంబర్ ల్యాండ్ సర్వే నెంబర్ ఉందా అంటూ, పరిశీలించిన దీనిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కావున ఎవరు కూడా ఇలా కబ్జా చేయవద్దు, ల్యాండ్ కబ్జా చేసే వారిపై కఠిన చర్య తీసుకుంటామని అధికారులు సూచించారు
నియోజవర్గ ఎమ్మెల్యే& కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్:
ఈ విద్యాలయంలో 26 గుంటలు కబ్జా చేసిన దానిపై, ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వీరిపై ఎలాంటి చర్య తీసుకుంటారు అంటూ ప్రజలు వేచి చూస్తున్నారు, వెంటనే స్పందించి అధికారులతో ఇలాంటి కబ్జాలు లేకుండా పె నిషింగ్ వైర్,రాళ్లు మొత్తం తీసేపిచ్చి, క్లియర్ చేసి కస్తూర్బా బాలికల విద్యాలయానికి గ్రౌండ్ కోసం వదిలేస్తారా అన్న విషయం తెలియాల్సి నియోజవర్గ ప్రజలకు ఈ విషయంపై తెలియాల్సి ఉంది.
హెచ్ఎంటీవీ చానల్ ను సంప్రదించిన రంజిత్:
విద్యాలయ ఆవరణలో కబ్జా చేసిన విషయం రంజిత్ హెచ్ఎంటీవీ చానల్ ని సంప్రదించగా, రిపోర్టర్ వివరాలు తెలుసుకొని ఈ కబ్జాపై వార్త రాయడం జరిగింది, నియోజవర్గంలో ఏ ఊర్లో అయినా, ఏ కబ్జా జరిగిన గాని, హెచ్ఎంటీవీ ఛానల్ సంప్రదించాల్సిన నంబర్,9701063143 ఆర్మూర్ కాన్స్టెన్సీ రిపోర్టర్: వంశీకృష్ణ, పైన ఉన్న నెంబర్ కు కాల్ చేసినతో వెంటనే స్పందించి వివరాలు తెలుసుకొని హెచ్ ఏం టీవీ ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుంది.




