Armoor: మున్సిపల్ కార్యాలయ వీడియోలు బయటకు ఎలా వచ్చాయి?

Armoor: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్ లీక్ అవ్వడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

VAMSHI, ARMOOR
Published on: 21 April 2026 7:32 PM IST
Armoor
X

Armoor: మున్సిపల్ కార్యాలయ వీడియోలు బయటకు ఎలా వచ్చాయి?

Armoor: జిల్లా కేంద్ర ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయం యొక్క సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయిన విషయాలు మున్సిపల్ కార్మికుల మొబైల్ ఫోన్ లో ఎలా వచ్చాయి అన్న విషయం చర్చనిఅంశంగా మారింది.

మున్సిపల్ కార్మికులకు ఫోన్ లో వీడియో ఎలా వచ్చింది:

పట్టణం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరా రికార్డు అయిన సమావేశ వీడియోస్ మున్సిపల్ కార్మికుల మొబైల్ లో ఎలా వచ్చాయి, ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా రికార్డింగ్ వీడియోలు బయటకు వెళ్ళవని, ఇటు ప్రజలకు అటు పొలిటికల్ పార్టీ వారికి అందరికి తెలిసిన విషయమే,

మరి ఈ కార్యాలయంలో సీసీ కెమెరా ఉన్న వీడియో బయటకు రావడం చాలా విశేషంగా మారింది, ప్రైవేట్ రంగంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే, దాని యొక్క యాక్సిస్ & పాస్వర్డ్ యజమానులు దగ్గర్నో లేదా మేనేజర్ దగ్గర ఉంటుంది, కానీ ప్రభుత్వ కార్యాలయం మొక్క సీసీ కెమెరా ఒక యాక్సిస్ & పాస్వర్డ్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కే తెలుసా, లేదా ఇంకా ఎవరి దగ్గరైనా ఉందా!

అసలు ఏముంది ఆ సీసీ కెమెరాల వీడియోలు:

ఇటీవలే మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే తో పాటు కౌన్సిలర్లు అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది, ఆ ఒక్క సమావేశంలో ఒక వ్యక్తి కౌన్సిలర్ కాకుండా గాని లోపల రూమ్లో ఉన్నాడు, ఆ వ్యక్తి ఎమ్మెల్యే అభివృద్ధి గురించి మాట్లాడుతుండగా, తను మాట మధ్యలో దూరి ఇష్టానుసారంగా వేలు పెట్టి చూపడం జరిగింది, అలాగే అక్కడ ఉన్న దళిత కౌన్సిలర్ మహిళను అని చూడకుండా గాని కాలుపై కాలేసి ఒక రౌడీగా కూర్చోవడం,

ఎమ్మెల్యే తో అలా మాట్లాడంతో అక్కడ ఉన్న బిజెపి కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు మాట తీరు మార్చుకో, ఒక ఎమ్మెల్యే తో ఎలా ప్రవర్తించాలో అది నేర్చుకో, ఈ వాగ్వాదం కొద్దిగా పెద్ద కావడంతో అక్కడ ఉన్న పోలీసులు అద్దుకోవడంతో సద్దుమణిగిన తోపులాట, అక్కడినుంచి కౌన్సిలర్ గాని వ్యక్తిని బయటకు తీసుకెళ్లారు, బయటకు తీసుకెళ్లిన తర్వాత కూడా ఇద్దరి మధ్య మాటకు మాట పెరిగాయి, ఆ మాటలు రికార్డు అయినా సిసి కెమెరా వీడియోనే బయటకు వచ్చింది.

నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి:

పట్టణ మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా రికార్డ్ అయిన వీడియోలు ఎలా బయటకు వస్తున్నాయి అంటూ మున్సిపల్ కమిషనర్, అధికారులను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్యాలయానికి సందర్శించి ప్రశ్నించడం జరిగింది, ఈ రికార్డు అయినా వీడియోలు & వాయిస్,

అధికార కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి మొబైల్ కి ఎలా వెళ్తున్నాయి అంటూ అడగడం జరిగింది, వెంటనే తక్షణమే ఈ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను తొలగించాలంటూ అధికారులను కోరడం జరిగింది, బహుశా ఈ రికార్డు అయినా వీడియోలు బయటకు రావడంతో, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న మాటలన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయి ప్రజలకి, ఇతర పార్టీ నాయకులకు, ఈ సంఘటన తోనే సీసీ కెమెరా వీడియోలు వ్యవరం బయటపడింది.

మున్సిపల్ కమిషనర్ - మున్సిపల్ చైర్పర్సన్:

పట్టణంలో రెండు నెలల క్రితమే నూతన మున్సిపల్ ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు రావడంతో, కాంగ్రెస్ పార్టీ తరపున మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ గా గోనే లహరి రఘు ఎన్నికయ్యారు, కార్యాలయంలో ఉన్న చైర్పర్సన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని మున్సిపల్ అభివృద్ధి, పనుల్లో, ఏ విషయమైనా కొత్తగానే ఉంది,

వారికి రాజకీయమే కొత్త కాబట్టి ఏం చేయాలన్న గాని ఆలోచించి చెయ్యాలి, కానీ మున్సిపల్ కమిషనర్ తన ఒక డ్యూటీని తన సర్వీస్ లో ఎక్కడెక్కడో చేసి వచ్చారు, కాబట్టి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి, ఈ సీసీ కెమెరా వీడియో బయటకు రావడంతో ప్రజలకు, పొలిటికల్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ఈ విషయం గందరగోళంగా మారింది, ఈ ఘటన పై ఎవరి హస్తం ఉందో తేల్చాల్సి ఉంది, పై అధికారులు ఎలాంటి చర్య తీసుకుంటారో వేచి చూడాల్సిందే ?

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story