Armoor: జెండా బాలాజీ జాతర ముగింపు వేడుకల్లో పాల్గొన్న వినయ్ రెడ్డి
Armoor: ఆర్మూర్ వెంకటేశ్వర ఆలయ ఆవరణలో జెండా పండుగ ముగింపు వేడుకలు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు.
Armoor: జెండా బాలాజీ జాతర ముగింపు వేడుకల్లో పాల్గొన్న వినయ్ రెడ్డి
ఆర్మూర్: జిల్లా కేంద్ర పట్టణంలో జెండా పండుగ ముగింపు వేడుక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న *ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి,
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాట్లాడుతూ
ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే, ఈ సంవత్సరం కూడా జెండా గల్లి, వెంకటేశ్వర ఆలయ ఆవరణ లో ఘనంగా జెండాను ప్రతిష్టాపించి, ఈ జెండాను ఇక్కడ తొమ్మిది రోజులు ఉంచుతూ, జెండా బాలాజీ జాతర నిర్వహిస్తూ, ఈ తొమ్మిది రోజులు, జండా బాలాజీ వెంకటేశ్వర స్వామికి రోజురోజు ప్రత్యేక పూజలు లాంటి కుంకుమార్చన, యజ్ఞం ఇలాంటి పూజ కార్యక్రమాలు అర్చకులు జెండా మధుకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
కావున పట్టణ ప్రజలు, ఇతర గ్రామ ప్రజలు అందరూ ఈ యొక్క జెండా బాలాజీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలంటూ, అలాగే ఈ యొక్క జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలంటూ ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతున్నాను, ఈరోజు తొమ్మిదో రోజు ముగించుకొని,కావున ఈ జెండాని ఇక్కడి నుంచి ఊరేగింపు చేస్తూ మన అంకాపూర్ గ్రామానికి సర్వ సమాజ్ ఆధ్వర్యంలో జెండాను అంకాపూర్ గ్రామస్తులకు అప్పగిస్తారు.
ఈ ముగింపు కార్యక్రమానికి నేను ముఖ్య అతిథులుగా పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంటు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డి తో పాటు పాల్గొన్న ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ , నిజామాబాద్ డిసిసి సెక్రెటరీ సాయినాథ్ గౌడ్ గారు ఆర్మూరు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శాంతి, కౌన్సిలర్లు నవీన్ , ప్రసాద్, గంగోలి,తాటి హనుమాన్లు, ఆర్మూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు , మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దయాకర్ రావు , కాంగ్రెస్ నాయకులు నూతల నారాయణరెడ్డి , చిట్టి రెడ్డి, దేగాం శ్రీనివాస్ గౌడ్ , ఏలియా రెడ్డి ,గంగాధర్ గౌడ్ , రాము , వెంకటగిరి , పివిఆర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




