Armoor: అర్మూర్‌లో కొత్త బీసీ బాలుర హాస్టల్ ఏర్పాటుకు ప్రతిపాదన
Armoor: కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి చొరవతో ఆర్మూర్‌లో కొత్త బీసీ బాలుర హాస్టల్ ఏర్పాటుకు చర్యలు. ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు.
Armoor: అర్మూర్‌లో కొత్త బీసీ బాలుర హాస్టల్ ఏర్పాటుకు ప్రతిపాదన
అర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ వినయ్ రెడ్డి చొరవ తో , సంబంధిత అధికారులతో సమన్వయం ఫలితంగా ఆర్మూర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (ZPHS Boys School) ఆవరణలో ప్రభుత్వ BC బాలుర హాస్టల్ (Hostel-B) ఏర్పాటు దిశగా కీలక పురోగతి చోటుచేసుకుంది.
జిల్లా BC అభివృద్ధి అధికారి, నిజామాబాద్ వారు BC సంక్షేమ శాఖ కమిషనర్‌కు పంపిన ప్రతిపాదనలో, ప్రస్తుతం పెర్కిట్‌లో ఉన్న ప్రభుత్వ BC బాలుర హాస్టల్‌ను రెండు హాస్టళ్లుగా విభజించి, ఆర్మూర్‌లో 200 మంది విద్యార్థుల సామర్థ్యంతో కొత్త BC బాలుర హాస్టల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే ప్రారంభ మౌలిక వసతులు, సిబ్బంది వేతనాల కోసం ₹8,56,960 మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ హాస్టల్ ఏర్పాటుతో ఆర్మూర్ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన BC విద్యార్థులకు నాణ్యమైన వసతి, విద్యా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు పేద విద్యార్థుల ఉన్నత విద్యకు మరింత ప్రోత్సాహం లభించనుంది.
శ్రీ వినయ్ రెడ్డి ఈ అవకాశాన్ని కల్పించేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, BC సంక్షేమ శాఖ అధికారులు మరియు సంబంధిత ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. హాస్టల్ ఏర్పాటు ప్రక్రియ త్వరగా పూర్తై విద్యార్థులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.




