Armoor: సిద్ధుల గుట్టలో అయ్యప్ప అన్నప్రసాదం

Armoor: మణికంఠ మాస పూజ సమితి అధ్యక్షుడు చేపూర్ ధనుంజయ్ పిలుపు.. మెట్ల పూజ, నైవేద్య కార్యక్రమాలు.

VAMSHI, ARMOOR
Published on: 1 Jun 2026 7:53 PM IST
Armoor
X

Armoor: సిద్ధుల గుట్టలో అయ్యప్ప అన్నప్రసాదం

అర్మూర్: ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప,కీ.శే. శ్రీ గణపతి రావు జోషి గురు స్వామి దివ్య ఆశీస్సులతో శ్రీ సుబ్బారావు గురుస్వామి ఆశీస్సులతో, అర్చకులు శ్రీ నాగేష్ శర్మ గురు స్వామి, మణికంఠ మాస పూజ సమితి ఆధ్వర్యంలో ప్రతినెల 1వ బుధవారము అన్న ప్రసాదము వితరణ కార్యక్రమము నవనాథ సిద్దుల గుట్ట, అయ్యప్ప స్వామి టెంపుల్ లో నిర్వహించబడుతుంది.

మణికంఠ మాస పూజ సమితి అధ్యక్షులు:

ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు చెపూర్ ధనుంజయ్ మాట్లాడుతూ ప్రతి నెలలో మొదటి బుధవారం మా సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తాము, ఈసారి సిద్దులగుట్ట, ఆలయ నిర్మాణ కర్త అయ్యప్ప శ్రీనివాస్,అయ్యప్ప దేవాలయంలో ఆ మణికంఠుడికి అభిషేకం, హ రతి, మెట్ల పూజ నిర్వహిస్తూ అనంతరం 12 గంటలకు మణికంఠుడికి నైవేద్యం చూపించి అన్నప్రసాదం భక్తులకు పెట్టడం జరుగుతుంది.

కావున అయ్యప్ప భక్తులు, నాన్ స్వామి భక్తులు, పెద్ద ఎత్తున, నెలలో మొదటి బుధవారం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని అయ్యప్ప స్వామి యొక్క కృప ఎల్లవేళలా మీ కుటుంబాలకు ఉండాలంటూ, పాత్రులు కాగలరని అని మనవి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మణికంఠ సేవ సమితి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సభ్యులు అందరూ కోరుకుంటున్నారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప శ్రీనివాస్ ఆలయ నిర్మాణ కర్త సహకారంతో మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూర్ ధనుంజయ్,ప్రధాన కార్యదర్శి ఉదయ్, కోశాధికారి సురేష్, సలహాదారులను శ్రీహరి, గురుస్వామి, కౌటిక విజయ్, గట్టడి గంగా మోహన్, అరుణ్ గురు స్వామి తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story