Armoor: ఆర్మూర్‌లో దీపావళి పేకాట కేసు కలకలం – సీఐ మౌనంపై అనుమానాలు

Armoor:ఆర్మూర్ పట్టణంలో దీపావళి రోజు పేకాట ఆడుతూ పట్టుబడ్డ వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచడంపై స్థానికంగా, రాజకీయ వర్గాల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

VAMSHI, ARMOOR
Published on: 13 Nov 2026 3:18 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్‌లో దీపావళి పేకాట కేసు కలకలం – సీఐ మౌనంపై అనుమానాలు

ఆర్మూర్: పట్టణంలో ఇటీవలే దీపావళి పండుగ రోజున రాత్రి పేకాట ఆడుతున్న వ్యక్తులపై మెరుపు దాడి చేసి పట్టుకున్నారు, పట్టణ సి. ఐ ఎందుకు అంతా మౌనం ఆ విషయం పై ప్రజలకు, ఇతర రాజకీయ వ్యక్తులకు అనుమానం వ్యక్తం గా మారింది ఆ పేకాట, ఆరోజు దొరికిన వారిలో ఎవరెవరు ఉన్నారు, పట్టణ ప్రజల్లో ఆల్రెడీ తెలిసిపోయింది.

రోజు రోజులు కరిస్తే గాని ఈ ఈ విషయం సీ.ఐ ఈ యొక్క వార్తను రిలీజ్ చేస్తూ గ్రూపులో పెడుతాడు ఏమో అని , కొంతమంది విలేకరులు కూడా ఎదురుచూస్తున్నారు, కానీ అ విషయాన్ని గ్రూపులో పెట్టకుండా అలాగే ఉండడంతో ఘటన కాస్త చర్చనీయాంశంగా మారింది.

జిల్లా సి.పి.సాయి చైతన్య:

దీపావళి పండుగ ప్రజలు జరుపుకొక ముందే, రాకముందే సీపీ సాయి చైతన్య ప్రెస్ మీట్ పెడుతూ ఎవరైనా ప్రజలు ఎక్కడైనా గాని , ఏ ప్రవేశంలో అయినా కానీ పేకాట ఆడితే వారి పై కఠిన చర్యలు తీసుకుంటానని మీడియా ద్వారా చెప్పడం జరిగింది. మాకు ఒక న్యాయం వేరే వారి కి ఒక న్యాయమా

సి. ఐ సార్:

గతంలో ఒక నెల 15 రోజులు కిందట పట్టణ సి.ఐ. గా సత్యనారాయణ గౌడ్ ఉండేది, తాను ట్రాన్స్ఫర్ గా నిజామాబాద్ కు బదిలీగా వెళ్ళాడు, పట్టణానికి కొత్తగా స్టేషన్ కి సి. ఐ గా ఛార్జ్ తీసుకున్న చంద్రశేఖర్ రెడ్డి, గత పది రోజుల కిందట కొందరు వ్యక్తులు వారి బాధ చెప్పుకుంటూ మాకు ఏజెంట్ మోసం చేశారని చెప్పేసి ఫిర్యాదు ఇయ్యగా, ఆ ఏజెంట్ ని పట్టుకొని, అరెస్టు చేసి మంచి పని చేశాడంటూ ప్రజల్లో ఉండిపోయాడు, ఈ విషయాన్ని క్రైమ్ రిపోర్టర్ గ్రూపులో పెట్టగానే, విలేకరులందరూ యథావిధిగా ఆ వార్తను రాశారు.

కొన్ని చానల్స్ యూట్యూబ్లో ప్లే చేయడంతో, ప్రజలు కామెంట్ రూపంలో వారి యొక్క విషెస్ (గుడ్ జాబ్ సార్, వెల్ డన్ సార్ ) అంటూ కామెంట్ చేశారు, ప్రజల్లో, అన్ని రాజకీయ పార్టీ, కార్యకర్తలు నాయకులలో మంచి పేరుగా తెచ్చుకున్న సి.ఐ చంద్రశేఖర్ రెడ్డి, మరి ఇప్పుడు ఎందుకు ఈ విషయంలో ఇలాగా చేస్తున్నాడు , సీ.ఐ. ఇలా చేయడంతో ప్రజల్లో పలు అనుమానాలు గా ఆలోచనలు తీసుకొస్తున్నాయి.

ఆరోజు పేకాటలో దొరికిన వారు అధికార పార్టీ కౌన్సిలర్లు , నియోజవర్గ ఇన్చార్జ్ బామ్మర్ది అని తెలిసిపోయిందె , నియోజవర్గ ఇన్చార్జ్ బామ్మర్దికి చైర్మన్ పదవి వస్తుంది అని కథ ఇదంతా, ఈ విషయాన్ని బయట తెలుపకుండా లో లోపట ఉంచుతే ఆ పదవి అతనికి దక్కడానికి అవకాశం ఉంటుందా, రోజులు ఇలాగే గడిచిపోతుంటే, రోజు రోజుకు అనుమానాలు పెరిగిపోతున్న ప్రజలు, సి. ఐ తనకు తను పని చట్ట ప్రకారంగా చేసుకుంటూ పోతే , మహా అయితే ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఏముంటుంది, ఇదంతాటికీ కారణం అధికార పార్టీ రాజకీయ ఒత్తిడేనా ? ఈ పేకాట విషయం సి.పి. సాయి చైతన్యకు తెలిసిందా? తెలియలేదా? తెలిసిన గాని అలాగనే ఊకుంటున్నాడా ?

ఈ విషయాన్ని ఇలాగానే లేట్ చేస్తే, ప్రజలందరూ మర్చిపోతారు, అనే భ్రమలో ఉన్నాడేమో సి.ఐ. అనుకుంటున్నారేమో.... ఈ విషయం పై ఇకముందు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే, మల్లొచ్చే వార్తలు చూద్దాం !

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR