Armoor: ఆర్మూర్ శ్రీ చంద్ర హైస్కూల్ విద్యార్థుల ఘన విజయం!
Armoor: ఆర్మూర్ శ్రీ చంద్ర హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో శ్రీరామ్, మోడల్ స్కూల్ జిల్లా ఫస్ట్ ర్యాంకర్ గా చిత్కల ఘన విజయం.
Armoor: ఆర్మూర్ శ్రీ చంద్ర హైస్కూల్ విద్యార్థుల ఘన విజయం!
ఆర్మూర్: శ్రీ చంద్ర హైస్కూల్ విద్యార్థులు ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి పాఠశాలకు కీర్తి తీసుకొచ్చారు. పాఠశాలకు చెందిన విద్యార్థి బోచ్కర్ శ్రీరామ్ అఖిల భారత సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో 300 మార్కులకు 252 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచి చంద్రాపూర్, మహారాష్ట్ర లో అడ్మిషన్ పొందడం జరిగింది.
అదే విధంగా విద్యార్థిని బోచ్కర్ చిత్కల తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 13వ ర్యాంకు, నిజామాబాద్ జిల్లా ప్రథమ ర్యాంకు సాధించి పాఠకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా శ్రీ చంద్ర హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీ పోల్కం నారాయణ, ప్రిన్సిపాల్ చట్ల రవి, ఉపాధ్యాయులు విద్యార్థులను ఘనంగా అభినందించారు.
వారి కృషి, పట్టుదల, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే ఈ విజయాలకు కారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలను సాధించి పాఠశాలకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.




