Armoor: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

Armoor: అర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సోమవారం ఘనంగా జరగనుంది.

VAMSHI, ARMOOR
Published on: 6 Sept 2026 7:43 PM IST
Armoor
X

Armoor: శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

అర్మూర్: అర్మూర్ నియోజవర్గం ఆర్మూర్ మండల్ అంకాపూర్ గ్రామంలో శ్రీ కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం గ్రామ ఆర్యవైశ్య కుటుంబాలు సభ్యులు అంతా కలిసి గ్రామ అర్చకులు వంశీ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి విగ్రహం ప్రస్థాపన రేపు అనగా సోమవారం 7 వ తారీక్ నాడు కార్యక్రమం నిర్వహించబడినది.

అంకాపూర్ గ్రామ ఆర్యవైశ్య కుటుంబాలు :

అంకాపూర్ గ్రామంలో శ్రీ కన్యకా పరమేశ్వరి విగ్రహ మూలవిరట్ ప్రతిష్టాపించడానికి గ్రామ ఆర్యవైశ్య కుటుంబం అంతా కలిసి గత రెండు రోజుల నుంచి ముందుగా ఆ విగ్రహానికి కొన్ని రోజులు పాటు వరుసగా నీటిలో (జలం ), ధాన్యంలో, పరువులపై ( శయ్య ) ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు, ఇది విగ్రహం లోని దోషాలను తొలగిస్తుంది, నవగ్రహ హోమం & మహాలక్ష్మి హోమం, ఆలయ పరిసరాలలో స్థానికుల శక్తిని నింపడానికి మరియు సమస్త శుభాలు కలగడానికి ఈ హోమాలు అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు, రేపు చివరిగా ఉదయం 6 గంటల నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజలు చేస్తూ కన్యకా పరమేశ్వర విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తారు, కావున గ్రామ ప్రజలు, ఇతర గ్రామ ప్రజలు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని , అన్న ప్రసారం స్వీకరించాలంటూ, గ్రామ వైశ్య కుటుంబాలు కోరుతున్నారు, అలాగే వారు మాట్లాడుతూ వాసవి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు, ఎల్లవేళలా మీ కుటుంబాలకు ఉండాలంటూ కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఆర్యవైశ్య కుటుంబాలు, ఏ. మార్కండేయ, డి. రాజేంద్రప్రసాద్, కే. లక్ష్మీనారాయణ, జి.మురళి, అర్థం సుభాష్, గంజి సుధాకర్, గంజి మధుకర్, బి సతీష్, గజవాడ విట్టల్, కే రమేష్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR