Armoor: ఆర్మూర్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం.. తహసీల్దార్

Armoor: ఆర్మూర్ మండలంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) పనులు శరవేగంగా సాగుతున్నాయి.

VAMSHI, ARMOOR
Published on: 25 April 2026 9:00 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం.. తహసీల్దార్

Armoor: ఆర్మూర్ మండలంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూర్ తాసిల్దార్ నడిమెట్ల సత్యనారాయణ ఆర్మూర్ మండల ప్రజలను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ లో భాగంగా అన్ని పోలింగ్ స్టేషన్లో సంబంధించిన బిఎల్ఓ లు ఓటర్ లిస్టు లో ఉన్న ఓటర్లందరినీ ఇంటింటికి తిరుగుతూ 2002 ఓటర్ లిస్ట్ లోని వివరాలతో 2025 ఓటర్ లిస్టును మ్యాపింగ్ చేస్తూ అప్డేట్ చేయడం జరుగుతున్నది.

ఇప్పటివరకు మండలంలో 52 వేల ఓటర్లకు గాను సుమారుగా 28 వేల ఓటర్లను వివరాలను మ్యాపింగ్ చేయడం జరిగినది. ఈ సందర్భంలో తహసిల్దార్ కోరుతూ మిగిలిన ఓటర్లు అందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని ఆవశ్యకతను గుర్తించి బిఎల్ఓ లకు సహకరించి తమ ఓటర్ వివరాలను ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరారు విద్యావంతులు చురుకైన ఆర్మూర్ ప్రజలను మరింత బాధ్యతాయుతంగా వారంతర వారి వాలంటీర్ గా వచ్చి బిఎల్ఓలతో తమ ఓటరు డాటా వివరాలను అప్డేట్ చేయించుకొనుటకు ముందుకు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story