Armoor: ఆర్మూర్ పోలీసులకు కాలనీవాసుల మొర.. ఆ దారిలో వెళ్లాలంటేనే భయం!
Armoor: ఆర్మూర్ కమల నెహ్రూ కాలనీ దారిలో వ్యాపారస్తుల ఆక్రమణలు. వాహనదారుల ఇబ్బందులపై స్పందించని పోలీసులు.
Armoor: ఆర్మూర్ పోలీసులకు కాలనీవాసుల మొర.. ఆ దారిలో వెళ్లాలంటేనే భయం!
ఆర్మూర్: జిల్లా కేంద్ర ఆర్మూర్ మున్సిపల్ ఎమ్మార్వో ఆఫీస్ ముందుగాల కమల నెహ్రు కాలనీ కి వెళ్లి దారిలో చిరు వ్యాపారుల దుకాణాలు ఏర్పాటయ్యాయి, ఆ రోడ్డుకు ఇటు, అటు రకరకాల వ్యాపారుల దుకాణాలు ఉన్నాయి, అందులో కూలర్ సంబంధించిన దుకాణులు, వివిధ ఎలక్ట్రానిక్ షోరూమ్స్, ఇంకా లోపటికి వెళ్తే గ్లాస్ ఎంపోరియం, ఫర్నిచర్స్, ట్రాన్స్పోర్ట్ వంటి వ్యాపారస్తులు ఉన్నారు, అక్కడ వ్యాపారం చేసేవాళ్లు , దుకాణం ముందే వారు సంబంధించిన కూలర్స్ గాని, చైర్స్ రోడ్డు కు దగ్గర పెట్టేసరికి వాహనదారులకు ఆ రోడ్డు లోపటికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది, మా బాధను పట్టించుకునే వారు ఎవరు లేరా, ఇకనైనా పట్టణ పోలీస్ వారు మా ఒక్క సమస్యని పట్టించుకోండి సార్ అంటూ హెచ్ఎంటీవీ కీ తెలియజేయడం జరిగింది.
కాలనీవాసులు యొక్క బాధ:
మా కాలనీకి వెళ్లాలంటే రోడ్డుకు అటు ఇటు దుకాణాలు ఉండడం వలన, ఆ రోడ్డు మీదకెళ్ళి వెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే వ్యాపారులు చేసేవారు రోడ్డు దాకా, వారి యొక్క ఐటమ్స్ పెట్టడం జరిగింది, అక్కడికి రోజు పెద్ద పెద్ద వెహికల్స్, ఒకేసారి అటు ఇటు ఎదురెదురుగా వాహనాలు రావడం వలన చాలా వేకిల్స్ జాం,డిస్టర్బెన్స్ అవడం జరిగింది, ఇకనైనా పట్టణ పోలీస్ వారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాన దారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
తూ.తూ. మంత్రంగా పట్టణ పోలీస్ & ట్రాఫిక్ పోలీస్:
ఇటీవలే కొన్ని పేపర్ లో పట్టణ ఎస్ హెచ్ ఓ విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది, రోడ్డుపైన ఎవరైనా పండ్ల బండ్లు, ఇతర వ్యాపార బోర్డులు గాని ఇలాంటి పెట్టరాదు, అలా పెట్టిన తో వారిపై చర్య తీసుకుంటామంటూ చెప్పిన విషయం పత్రికలో ఇవ్వడం జరిగింది,
పోలీస్ వారికి వ్యాపారస్తులు కోరడం జరిగింది, కేవలం మీరు కొత్త బస్టాండ్ ముందు డే కాకుండా, ఇంకా వివిధ పట్టణ మున్సిపల్ పాత బస్టాండ్ పంత్ రోడ్ లో ఇంకో ఎన్నో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, కావున పట్టణ మొత్తం దృష్టి పెట్టి రోడ్డుకు అటు ఇటు ఎలాంటి బోర్డు లేకుండా చూలాలంటూ హెచ్ఎంటివి తెలుగు ఛానల్ ద్వారా కోరుతున్న పట్టణ ప్రజలు తెలియడం జరిగింది. దీనిపై పోలీసు వారి పనితీరు ఏ రకంగా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.




