Nizamabad: డిచ్‌పల్లిలో 'బ్రివో ఏఏసీ బ్లాక్స్' పరిశ్రమ ప్రారంభం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో 'బ్రివో ఏఏసీ బ్లాక్స్' పరిశ్రమను ఎంపీ అరవింద్ ప్రారంభించారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 26 April 2026 8:44 PM IST
Nizamabad
X

Nizamabad: డిచ్‌పల్లిలో 'బ్రివో ఏఏసీ బ్లాక్స్' పరిశ్రమ ప్రారంభం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లిలో స్థాపించబడిన " బ్రివో ఎ ఎ సి బ్లాక్స్ బ్రిక్స్ కంపెనీ” ని ప్రారంభించిన ఎంపీ అరవింద్, ఈ సందర్భంగా మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లాకే తలమానికంగా నిలిచిన డిచ్‌పల్లి మండలానికి పరిశ్రమలు రావడం ఎంతో సంతోషకరమని తెలిపారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ బ్రివో ఎ ఎ సి బ్లాక్స్ బ్రిక్స్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న, అలాగే ఫ్యాక్టరీ భాగస్వామి వెంకటరమణలకు ఎంపీ అరవింద్ అభినందనలు తెలిపారు.

ఈ ఫ్యాక్టరీ ద్వారా తక్కువ ఖర్చుతో, నాణ్యమైన, బలమైన ఇటుకలతో సాధారణ ప్రజలు సైతం తమ ఇళ్లను నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు. వాతావరణానికి హానికరం కాకుండా నిర్మాణ సామగ్రి అందుబాటులోకి రావడం అభివృద్ధికి దోహదమని అన్నారు. నాలుగు నుంచి ఐదు జిల్లాలకు కేంద్రంగా ఉన్న డిచ్‌పల్లిలో ఈ ఫ్యాక్టరీ ఏర్పడటం ద్వారా వ్యాపార అవకాశాలు విస్తరించడంతో పాటు,

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిశ్రమలు యువతలో నిరుద్యోగ సమస్యను తగ్గించి, వారికి కొత్త దారులు చూపిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణతో పాటు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story