Bichkunda: ఎఫ్‌పీజీ, ఎఫ్‌పీసీల ఏర్పాటుపై రైతులకు అవగాహన

Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద రైతు వేదికలో ఎఫ్‌పీజీ, ఎఫ్‌పీసీల ఏర్పాటు, పనితీరుపై రైతులకు సెర్ప్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు.

VEERANNA, JUKKAL
Published on: 7 Nov 2026 8:08 PM IST
Bichkunda
X

Bichkunda: ఎఫ్‌పీజీ, ఎఫ్‌పీసీల ఏర్పాటుపై రైతులకు అవగాహన

బిచ్కుంద (కామారెడ్డి): రైతు ఉత్పత్తి దారుల కంపెనీ రైతులందరు సంఘాటీతమై వ్యవసాయ రంగంలో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యం తో రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, కంపెనీ ల ఏర్పాటు పై శనివారం జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, పెద్ద కొడపగల్ మండలాలకు చెందిన వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బిచ్కుంద పట్టణంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమం లో శ్రీ రాజరాజేశ్వర రైతు ఉత్పత్తి దారుల కంపెనీ పరిధిలో ఈ సమావేశం జరిగింది.

అవగాహన కార్యక్రమం లో భాగంగా ఒకే ప్రాంతానికి చెందిన రైతులు సమూహంగా ఏర్పడి పెట్టుబడులు, సాగు పద్ధతులు, వ్యవసాయ అవసరాలు, పంటల విక్రయల విషయం లో పరస్పరం సహకరించుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం అని డి పి ఎం పామ్ సురేష్ కుమార్, సెర్ఫ్ పామ్ విభాగం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ లు రవీందర్ రావ్ లు వివరించారు.

ఎఫ్ పి జి, ఎఫ్ పి సి లను సద్వినియోగం పర్చుకునేందుకు గాను రైతులందరు ఐక్యంగా చైతన్య వంతులై ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు తమ కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహించుకుంటే వ్యవసాయాన్ని రాబోయే రోజుల్లో మరింత లాభసాటిగా మార్చుకోవచ్చని ఈ అవగాహన ద్వార రైతులకు తెలియజేశారు.

కార్యక్రమం లో ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ వీరేశం, బిచ్కుంద ఏ పి ఎం రవీందర్, జుక్కల్ ఏ పి ఎం వందేమాతరం, మద్నూర్ ఏ పి ఎం జగదీష్, బోర్డు డైరక్టర్లు గంగామణి, శేషమ్మ, పి ఎం ఎఫ్ ఎం ఎఫ్ కో ఆర్డినేటర్ కళ్యాణ్, ఆపరేటర్లు నరేష్, జబ్బార్, సి సి లు మైషయ్య, వెంకటేష్, మారుతి తో పాటు మూడు మండలాలకు చెందిన వి ఓ ఏ లు, రైతులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL