Armoor: ఆర్మూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా బి. అరుణ్ కుమార్ బాధ్యతలు!

Armoor: ఆర్మూర్ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్‌గా బి. అరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.

VAMSHI, ARMOOR
Updated on: 3 July 2026 6:23 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా బి. అరుణ్ కుమార్ బాధ్యతలు!

ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన బి. అరుణ్ కుమార్ గతం లో 18 నెలలు గా డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ గా జగిత్యాల జిల్లాలో ని మెట్టుపల్లి లో విధులు నిర్వహించి, పదోన్నతి పై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా ఆర్మూర్ కు రావడం జరిగింది.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి.అరుణ్ కుమార్ :

బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆర్మూర్ నియోజవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి మొక్క ను అందించారు.

ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ:

ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన బి. అరుణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుతూ.ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణం లో ఉంది, కాబట్టి దానికి సంబంధించిన కాళీ స్థలం లో లక్ష మొక్కలు నాటి పర్యాటక ప్రదేశం గా తీర్చాలి, గుట్ట ప్రాంతాన్ని మొక్కలు పెంచి అడవి లా తయారు చేసి అందరికీ ఆహ్లాదాన్ని అందించాలని, ప్రతీ మొక్క బ్రతికేలా పర్యవేక్షణ ఉండాలి దానికి ప్రత్యేకంగా ఒక అటవీ అధికారి కి బాధ్యతలను ఇవ్వాలని ఎమ్మెల్యే కోరడం జరిగింది.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story