Balkonda: బాల్కొండలో గంజాయి విక్రేత రిమాండ్.. 31 మందిపై కేసులు!

Balkonda: నిజామాబాద్ జిల్లా బాల్కొండలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి తాగుతున్న 31 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

VENU, BALKONDA
Published on: 26 Aug 2026 8:39 PM IST
Balkonda
X

Balkonda: బాల్కొండలో గంజాయి విక్రేత రిమాండ్.. 31 మందిపై కేసులు!

బాల్కొండ: నిజామాబాదు జిల్లా బాల్కొండలోని మల్లన్న గుట్టవద్ద మరియు వన్నెల్ బి వరద కాలువ వద్ద కొందరు వ్యక్తులు గంజాయి తాగుతున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు బాల్కొండ పోలీసులు అక్కడికి చేరుకోని 31 మందిని గంజాయి తాగుతూ పట్టుబడ్డవారిని,విక్రయించే ఒక వ్యక్తి వద్ద 40 గ్రాముల ఎండు గంజాయి మరియ ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

గంజాయి విక్రయించే వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. గంజాయి తాగిన వారిపై కేసు నమోదు చేసి అడిక్షన్ సెంటర్లకు తరలించనున్నట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపారు. శంకర్, రాజేష్, నవీన్, ఫరూక్, మహిపాల్, రాములు సిబ్బంది ఉన్నారు.

VENU, BALKONDA

VENU, BALKONDA