Nizamabad: ఘనంగా బంజారా తీజ్ ఉత్సవాలు.. 9 రోజుల షెడ్యూల్ ఇదే!

Nizamabad: నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో బంజారా తీజ్ ఉత్సవాలు ఆగస్టు 14 నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి.

M. RAMESH,NIZAMABAD
Published on: 14 Aug 2026 4:06 PM IST
Nizamabad
X

Nizamabad: ఘనంగా బంజారా తీజ్ ఉత్సవాలు.. 9 రోజుల షెడ్యూల్ ఇదే!

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పాత కలెక్టరేట్ గ్రౌండ్ ఘనంగా తీజ్ వేడుకలు. జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు బంజర సంఘం ఆధ్వర్యంలో కలిసి తీజ్ పండగను తీజ్ ఉత్సవం ఆగస్టు 14 నుండి 23 వరకు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, మహిళలు, యువత JAC గా ఏర్పడి ఈ తీజ్ వేడుకలను నిర్వహిస్తున్నారు.ఆగస్టు 14న గోధుమలు, శనగలు నానబెట్టడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది.15న తీజ్ బుట్టల్లో విత్తనాలు అలగడం, డాకళో ఏర్పాటు, కాగడాలతో బోరడి ఛపాయెరొ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భోగ్-పూజా, ధూంవాడి, రాత్రి 7:30 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుపబడతాయని తెలిపారు.

21న ఢమోళి, లడ్డు పంపిణీ, 22న గౌరీ తయారీ, భత్-కోల్ ప్రసాదం, ఒక్కపొద్దుల విడుపు ఉంటాయి.

23న చివరి రోజు మహాభోగ్-భండారో, గుమ్మడికాయ కొట్టడం, మధ్యాహ్నం 3 గంటలకు ఆటపాటలతో మహా ర్యాలీ, నిమజ్జనంతో ఉత్సవాల తో ముగుస్తాయి తెలిపారు.తీజ్ మన సంస్కృతి, మన గౌరవం, ఐక్యతే మన బలం అని తీజ్ ఉత్సవ కమిటీ తెలిపారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story