Banswada: విద్యార్థులకు యూనిఫాంలు, షూస్ పంపిణీ చేసిన కాసుల బాలరాజు!
Banswada: బాన్సువాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు, బూట్లు పంపిణీ చేసిన ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు. విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి.
Banswada: విద్యార్థులకు యూనిఫాంలు, షూస్ పంపిణీ చేసిన కాసుల బాలరాజు!
Banswada: ప్రభుత్వ పాఠశాల బాన్సువాడ లో యూనిఫార్మ్స్ మరియు షూస్ పంపిణీ కార్యక్రమము హెడ్మాస్టర్ లక్క నరహరి గారి అధ్యక్షతన జరిగినది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు , స్థానిక కౌన్సిలర్ మహ్మద్ కాలిక్ ఆప్షన్ సభ్యులు కమర్ సుల్తానా గౌస్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాసుల బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీఠ వేస్తుందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని, భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గోపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి నిజాంసాగర్ ప్రదీప్ పటేల్ దామరంచ సర్పంచ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీర్పూర్ యామ రాములు కాంత్ రెడ్డి కాశీరాం ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు.




