Banswada: బాన్సువాడలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ
Banswada: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ బాన్సువాడలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ నాయకులు.
Banswada: బాన్సువాడలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ
బాన్సువాడ: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని ఆరోపించారు.
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ముసుగులో కాక్రోచ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు దేశంలో అల్లరు సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారన్నారు.
ఢిల్లీలో జరిగిన సంఘటన దేశ విగ్రహ శక్తులు విద్యార్థుల ర్యాలీలో చొరబడి విధ్వంసం చేయాలని చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం తిప్పి కొట్టిందన్నారు.
బంగ్లాదేశ్ , పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలలో యువత మోసపోవద్దని, దీనివల్ల భవిష్యత్తు అందాకారమవుతుందన్నరు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ లు పాల్గొన్నారు.




