Kamareddy: చెయిన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ పోస్ట్ మాస్టర్ అరెస్ట్!

Kamareddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆన్‌లైన్ గేమింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని, పోస్ట్ ఆఫీస్ ఫ్రాడ్‌కు పాల్పడి సస్పెండ్ అయిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 July 2026 9:58 PM IST
Kamareddy
X

Kamareddy: చెయిన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ పోస్ట్ మాస్టర్ అరెస్ట్!

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో దొంగగా మారిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్.చైన్ స్నాచింగ్ చేసి పారి పోయిన దొంగ బత్తుల మునీశ్వర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు.నసురుల్లా బాద్ మండలం దుర్కి పోస్ట్ ఆఫీస్ కు సంబంధించిన సుమారు 12 లక్షలు ఫ్రాడ్ చేసి ఆన్లైన్ గేమింగ్ లో పోగొట్టుకున్న పోస్ట్ మాస్టర్ బత్తుల మునీశ్వర్.

బంధువుల వద్ద పదకొండున్నర లక్షలు డబ్బులు తీసుకుని పోస్ట్ ఆఫీస్ అధికారులకు చెల్లించిన మునీశ్వర్.10 రోజుల క్రితమే బత్తుల మునీశ్వర్ ను సస్పెండ్ చేసిన అధికారులు.పోస్ట్ ఆఫీస్ కి బాకీ ఉన్న మిగత 42 వేలు చెల్లించటానికి, బాన్సువాడ లొ ఓ కిరాణా షాపులో మద్యం అమ్ముతున్నారు అంటూ నేను ఎక్సైజ్ కానిస్టేబుల్ అని చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ మునీశ్వర్.

పోలీసులు కేసు నమోదు చేసి సిసి ఫుటేజ్ ఆధారంగ దొంగను గుర్తించి పట్టుకున్న పోలీసులు.23 గ్రాముల బంగారు గొలుసు,బైక్,మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రెస్ మీట్ లొ తెలిపిన డిఎస్పి విఠల్ రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story