Banswada: బాన్సువాడలో అక్రమ గ్యాస్ సిలిండర్ల గోదాముపై దాడులు

Banswada: బాన్సువాడలోని రేకుల గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 75 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసిన సివిల్ సప్లై అధికారులు. నిందితులపై కేసులు నమోదు చేస్తామని ASO హెచ్చరిక.

SALEEM, BANSWADA
Published on: 5 Nov 2026 9:56 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో అక్రమ గ్యాస్ సిలిండర్ల గోదాముపై దాడులు

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లోని రాజారాం దుబ్బాలో ఒక రేకుల గోదాoలో అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలెండర్లూ,75 లను సివిల్ సప్లై అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకుని,అట్టి సిలెండర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న సైలెండర్లలో 68 కమర్షియల్,07 డొమెస్టిక్ సిలెండర్లు ఉన్నాయి.అందులో 60 కమర్షియల్ సిలెండర్లు గ్యాస్ తో నిండి ఉన్నాయి, అక్రమంగా ఎవరైనా అమ్మినా,నిలువ ఉంచినా అది నిబంధనలకు విరుద్ధమని,అలా చేస్తే వారి పై కేసులు నమోదు అవుతాయని ఏ ఎస్ ఓ రవీందర్ రాథోడ్ తెలిపారు.

ఈ దాడుల్లో ఏ ఎస్ ఓ రవీందర్ రాథోడ్ తో పాటు,ఎన్ఫోర్స్మెంట్ డీ టీ లు అశోక్,బాలయ్య ల తో పాటు,జీ పీ ఓ లు ఆనంద్ కుమార్,శ్రీ హర్ష,లతో పాటు స్థానిక పోలీసులు ఉన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA