Banswada: బాన్సువాడలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క!

Banswada: బాన్సువాడ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కలిసి జీపీ భవనం, సబ్‌స్టేషన్‌ సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

SALEEM, BANSWADA
Published on: 27 Oct 2026 11:50 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క!

బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభోత్సవాలు, భూమిపూజలు నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్,మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి అనసూయ సీతక్క , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి , జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ షెట్కర్ , రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ శ్రీ కాసుల బాలరాజు , మాజీ డీసీసీబీ ఛైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి , కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ .

ఈ సందర్భంగా బాన్సువాడ గ్రామీణ మండలం కొయ్యగుట్ట తాండలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలకు మంత్రి సీతక్క భూమిపూజ నిర్వహించారు. అనంతరం బాన్సువాడ పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అలాగే బాన్సువాడ మండలం బోర్లం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.

ఈ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంతో పాటు మహిళా సంఘాలకు అవసరమైన వసతులను అందుబాటులోకి తీసుకురావడానికి దోహదపడనున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ, గ్రామీణ ప్రాంతాల ప్రగతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందనీ మంత్రి సీతక్క అన్నారు.

ఈ కార్యక్రమాల్లో బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కాసుల విజయ బాలరాజు , కౌన్సిలర్లు, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA