Banswada: దివ్యాంగ విద్యార్థులకు సహాయక ఉపకరణాల గుర్తింపు శిబిరం

Banswada: బాన్సువాడలో దివ్యాంగ విద్యార్థులకు సహాయక ఉపకరణాల గుర్తింపు శిబిరం. 100 మంది విద్యార్థులకు ఉపకరణాలు గుర్తింపు.

SALEEM, BANSWADA
Published on: 22 Sept 2026 11:36 PM IST
Banswada
X

Banswada: దివ్యాంగ విద్యార్థులకు సహాయక ఉపకరణాల గుర్తింపు శిబిరం

బాన్సువాడ: బాన్సువాడ డివిజన్లోని అన్ని మండలాలలోని పాఠశాలలకు చెందిన దివ్యాంగ విద్యార్థుల కోసం ఉపకరణాల గుర్తింపు శిబిరం సోమవారం బాన్సువాడలోని సరస్వతి కళ్యాణ మండపంలో నిర్వహించారు.

ఈ శిబిరంలో వైద్య నిపుణులు దివ్యాంగ విద్యార్థులను పరీక్షించి, వారి అవసరాలకు అనుగుణంగా అవసరమైన సహాయక ఉపకరణాలను గుర్తించారు. ఈ సందర్భంగా బాన్సువాడ మండలం నుంచి 23 మంది, బీర్కూర్ మండలం నుంచి 12 మంది, నస్రుల్లాబాద్ మండలం నుంచి 8 మంది, మిగతా మండలాల నుంచి 57 మంది,మొత్తం 100 మంది దివ్యాంగ విద్యార్థులను సహాయక ఉపకరణాల కోసం గుర్తించడం జరిగింది.

ఈ ఉపకరణాలు విద్యార్థుల విద్యాభ్యాసం, రోజువారీ కార్యకలాపాలు, చలనశీలత మరియు స్వయం ఆధారిత జీవనానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ALIMCO వైద్యులు డా. రాజశేఖర్ రెడ్డి, సహాయక సిబ్బంది, కామారెడ్డి జిల్లా ప్రత్యేక విభాగం కోఆర్డినేటర్ బి. నాగవెందర్, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎం. కృష్ణ చైతన్య , బాన్సువాడ మండల ప్రత్యేక ఉపాధ్యాయులైన వసంత్ కుమార్, అనిల్ ,సాయి చరణ్ ,మరియు పద్మ మేడం తో పాటు బాన్సువాడ డివిజన్లోని అన్ని మండలాల ప్రత్యేక ఉపాధ్యాయులు మరియు ఐఈఆర్పిలు పాల్గొన్నారు.

దివ్యాంగ విద్యార్థుల అవసరాలను గుర్తించి, వారికి తగిన సహాయక ఉపకరణాలు అందించేందుకు నిర్వహించిన ఈ శిబిరం విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA