Banswada: నిజాన్ని నిర్భయంగా రాయాలి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Banswada: బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణ తరగతులు ముగిశాయి. జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా రాస్తూ నైతిక విలువలు కాపాడాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు.

SALEEM, BANSWADA
Published on: 30 Sept 2026 10:32 PM IST
Banswada
X

Banswada: నిజాన్ని నిర్భయంగా రాయాలి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

బాన్సువాడ: బాన్సువాడలో రెండు రోజుల పాటు కొనసాగిన జర్నలిస్టుల శిక్షణ తరగతులు ఘనంగా ముగింపు సభకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు సమాజంలో నైతిక విలువలను కాపాడుకుంటూ, నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

కామారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలకు చెందిన జర్నలిస్టుల కోసం తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బాన్సువాడ SRNK డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరయ్యారు.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, "జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జిల్లాలో సుమారు 500 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేశాం.

తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఇలాంటి శిక్షణ ఇవ్వడం ప్రశంసనీయం అని అన్నారు.. దీని వల్ల జర్నలిస్టులు క్రైమ్, సివిల్, రెవెన్యూ వంటి అంశాలపై నైపుణ్యం సాధిస్తారు. ఏఐ ద్వారా వచ్చే సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకున్న తర్వాతే వార్తలు రాయాలి, వాస్తవాలను నిర్ధారించడమే జర్నలిజం విలువను పెంచుతుంది" అని అన్నారు.

మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా రాయాలి. పత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా ద్వారా ప్రజలకు చేరే వార్తలు వాస్తవాధారంగా, సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. జర్నలిస్టులు కేవలం వార్తలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వారధులుగా ఉండాలి. జర్నలిస్టులకు చట్టాలపై అవగాహన అవసరం.

ముఖ్యంగా సమాచార హక్కు చట్టం (RTI) ను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ప్రస్తుతం AI, సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జర్నలిజంలో అనేక మార్పులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా ఫ్యాక్ట్ చెకింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆధునిక సాంకేతికతను వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు వాడుకోవాలి" అని సూచించారు.

రెండు రోజుల పాటు తొమ్మిది మంది సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్లు వార్తా సేకరణ, రచన, నైతిక విలువలు, చట్టపరమైన అంశాలు, డిజిటల్ మీడియా, AI పై శిక్షణ ఇచ్చి,వృత్తి నైపుణ్యాన్ని పెంచే విషయాలపై అవగాహన కల్పించారు.

ఈ రోజు ముగింపు కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీపీఆర్వో, ఎన్ వై గిరి, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, TUWJ-IJU జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA