Banswada: పోతరాజు వేషధారణ.. ఆకట్టుకున్న కాకతీయ విద్యార్థుల బోనాల పండుగ
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కాకతీయ పాఠశాలలో ఆషాఢ మాస బోనాల పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు అత్యంత వైభవంగా నిర్వహించారు.
Banswada: పోతరాజు వేషధారణ.. ఆకట్టుకున్న కాకతీయ విద్యార్థుల బోనాల పండుగ
బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో గల కాకతీయ పాఠశాలలో సోమవారం ఆషాఢ మాస బోనాల పండుగను విద్యార్థులు ఘనంగా,ఆనందోత్సాహాల తో నిర్వహించారు.విద్యార్థుల వేషాధారణలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా పోతరాజు వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఉపాధ్యాయ బృందం ,విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ దుస్తులు ధరించారు.ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయుడు యాదగిరి,ఇంచార్జి అనురాధ,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Next Story




