Banswada: ఇందిరా గాంధీ విగ్రహ పునఃప్రతిష్ఠాపన పనుల పరిశీలన

Banswada: బాన్సువాడలో రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం తొలగించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహ పునఃప్రతిష్ఠాపన ఏర్పాట్లను కాసుల బాలరాజు పరిశీలించారు.

SALEEM, BANSWADA
Published on: 15 Nov 2026 10:44 PM IST
Banswada
X

Banswada: ఇందిరా గాంధీ విగ్రహ పునఃప్రతిష్ఠాపన పనుల పరిశీలన

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విగ్రహ పునర్నిర్మాణా పనులను,ఆలాగే గత కొన్ని రోజుల క్రితం రోడ్డు వెడల్పు పనుల నిమిత్తం ఇందిరా గాంధీ విగ్రహాన్ని తీసి,పనులు పూర్తి చేసిన అనంతరం తిరిగి విగ్రహాన్ని ఈ రోజు పునః ప్రతిష్టింప జేసీ చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పరిశీలించారు.

రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చేపడుతున్న విగ్రహ పునర్నిర్మాణానికి (Reconstruction Works) సంబంధించి చేపట్టాల్సిన పనులు, ఏర్పాట్ల వివరాలను స్థానిక నాయకులు, మున్సిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రాంగణ అభివృద్ధి , పరిసరాల సుందరీకరణ, అవసరమైన ఏర్పాట్లపై ఆయన పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మా బేగం ఎజాజ్, 3వ వార్డు కౌన్సిలర్ హకీమ్, నాయకులు నార్ల రవీందర్, రఫిక్, సయ్యద్ ఇలియాస్ అలీ, మున్సిపల్ సిబ్బంది సతీష్ తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA