Banswada: బాన్సువాడలో ఘనంగా కోట దుర్గమ్మ బోనాలు
Banswada: బాన్సువాడ కోట దుర్గమ్మ ఆలయంలో బోనాల ఊరేగింపు ఘనం. మాజీ ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు.
Banswada: బాన్సువాడలో ఘనంగా కోట దుర్గమ్మ బోనాలు
బాన్సువాడ కోట దుర్గమ్మ బోనాల్లో మాజీ ఎంపీ బీ బీ పాటిల్
ఈరోజు బాన్సువాడ పట్టణంలోని కోటగల్లీలో ఉన్న కోట దుర్గమ్మ ఆలయం లో బోనాల ఊరేగింపు ఘనంగా జరిగింది.ఈ బోనాల ఉత్సవాల్లో మాజీ ఎంపీ బిబి పాటిల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ నెలరోజుపాటు బోనాల పండుగలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ ప్రజలు మరియు దేశ ప్రజలు సుఖ సంతోషాలతో మంచి పంటలు పండాలని తెలంగాణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి కోట దుర్గమ్మ ఆలయ అధ్యక్షులు పద్మ నరేష్ బిజెపి కౌన్సిలర్ గజ్జల మహేష్ బిజెపి జిల్లా కౌన్సిల్ నెంబర్ ప్రసాద్ బిజెపి కిషన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి బిజెపి నాయకులు పాశం భాస్కర్ రెడ్డి శ్యామల శ్రీకాంత్ పురుషోత్తం బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




