Banswada: కలెక్టర్ చేతుల మీదుగా ల్యాబ్ అనాలిస్ట్ హిమాయత్‌కు ఉత్తమ సేవా అవార్డు

Banswada: ఏరియా & ఎంసీహెచ్ ఆసుపత్రిలో 3.15 లక్షలకు పైగా వైద్య పరీక్షలు నిర్వహించిన ల్యాబ్ అనాలిస్ట్ షేక్ హిమాయత్.. కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు.

SALEEM, BANSWADA
Published on: 17 Aug 2026 10:45 PM IST
Banswada
X

Banswada: కలెక్టర్ చేతుల మీదుగా ల్యాబ్ అనాలిస్ట్ హిమాయత్‌కు ఉత్తమ సేవా అవార్డు

బాన్సువాడ: బాన్సువాడ ఏరియా హాస్పిటల్ & MCH హాస్పిటల్‌లో ల్యాబ్ అనాలిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ హిమాయత్ ఆధ్వర్యంలో ల్యాబ్ టీమ్ గత సంవత్సరంలో 3,15,095 పరీక్షలు నిర్వహించి విశేష సేవలు అందించింది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ల్యాబ్ టీమ్ కీలక పాత్ర పోషించింది.

విధి నిర్వహణలో చూపిన అంకితభావం, సేవా స్పూర్తికి గుర్తింపుగా ఆగస్టు 15న కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మరియు ఎమ్మెల్యే మదన్ మోహన్ చేతుల మీదుగా షేక్ హిమాయత్ బెస్ట్ ఎంప్లాయి అవార్డును అందుకున్నారు. ఈఅవార్డును తన వ్యక్తిగత విజయంగా కాకుండా, మొత్తం ల్యాబ్ టీమ్ చేసిన కృషికి దక్కిన గౌరవంగా షేక్ హిమాయత్ పేర్కొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story