Banswada: బాన్సువాడలో నాటుబాంబు పేలుడు: వ్యక్తి మృతి

Banswada: బాన్సువాడ పరిధిలోని తాడుకోలు రాజారాం దుబ్బ కాలనీలో నాటుబాంబుల పేలుడులో తీవ్రంగా గాయపడిన కడమంచి రమేష్ నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

SALEEM, BANSWADA
Published on: 7 Nov 2026 8:26 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో నాటుబాంబు పేలుడు: వ్యక్తి మృతి

బాన్సువాడ: బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడుకోలు గ్రామ పంచాయతీ రాజారాం దుబ్బ కాలనీ లో 01.11.2026 తేదీన అడవి పందుల వేటకు వెళ్లేందుకు నాటుబాంబులు సిద్ధం చేస్తుండగా పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో కడమంచి రమేష్‌తో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కడమo చీ రమేష్‌ను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ 07.11.2026 తేదీన ఉదయం 05:55 గంటలకు మృతి చెందాడు.

జనావాసాల మధ్య నాటుబాంబులను తయారు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు విచారణలో వెల్లడైదని,ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీ ఐ తెలిపారు.

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి: నాటుబాంబులు, పేలుడు పదార్థాలను తయారు చేయడం, నిల్వ చేయడం, వినియోగించడం చట్టరీత్యా నేరం. ఇలాంటి ప్రమాదకర చర్యలకు ఎవరూ పాల్పడవద్దు. సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలనీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పిఎస్ బాన్సువాడ తుల శ్రీధర్ కోరారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA