Banswada: ఫ్లడ్‌లైట్ల కాంతుల్లో బాన్సువాడ తొలి నైట్ క్రికెట్ టోర్నీ!

Banswada: బాన్సువాడ ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో తొలి నైట్ క్రికెట్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది.

SALEEM, BANSWADA
Published on: 24 Oct 2026 10:26 PM IST
Banswada
X

Banswada: ఫ్లడ్‌లైట్ల కాంతుల్లో బాన్సువాడ తొలి నైట్ క్రికెట్ టోర్నీ!

బాన్సువాడ: బాన్సువాడ చరిత్రలోనే మొదటిసారి... మినీ స్టేడియం ఫ్లడ్ లైట్ల వెలుగులో పగటిలా మారింది. ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో శనివారం రాత్రి ప్రారంభమైన నైట్ క్రికెట్ టోర్నమెంట్ కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఓపెనింగ్ మ్యాచ్ కే హై ఓల్టేజ్ డ్రామా నడిచింది. ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా ఫైనల్ రేంజ్ లో ఉత్కంఠ రేపింది. కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఏజాజ్, కాసుల రోహిత్, కౌన్సిలర్ ఎం.ఏ హకీం కేక్ కట్ చేసి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు.

టాస్ గెలిచిన పోలీస్ టీమ్ బ్యాటింగ్ ఎంచుకుని 7 ఓవర్లలో 70 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ప్రెస్ టీమ్ కూడా 7 ఓవర్లలో 70 రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయ్యింది.నిర్వాహకులు సూపర్ ఓవర్ ఆడించారు. ఫస్ట్ సూపర్ ఓవర్ లో ప్రెస్ జట్టు 4 బంతుల్లో 2 వికెట్లు, పోలీస్ 2 బంతుల్లో 2 వికెట్లు - మళ్లీ టై గా ముగిసింది.మళ్ళీ ఉత్కంఠ పెరిగింది.నిర్వాహకులు మళ్ళీ ఇరు జట్లకు

రెండవ సారి సూపర్ ఓవర్ ఆటను ఆడించారు.-రెండవ సూపర్ ఓవర్ లో పోలీస్ జట్టు 2 బంతుల్లో ఆలౌట్, ప్రెస్ జట్టు మొదటి బంతికే 1 రన్ కొట్టి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది.మొత్తానికి ఆరంభ మ్యాచ్ అదరగొట్టింది.వీక్షకులు ఊపిరి బిగ పట్టి తిలకించే విధంగా మ్యాచ్ కొనసాగడం తో ఆనందాలకు అవధులు లేకుండా పోయింది.

ఈ మ్యాచ్ లో

నమస్తే తెలంగాణ రిపోర్టర్ వై. ఆనంద్ - హ్యాట్రిక్ వికెట్లతో (3 వికెట్లు), బ్యాట్ తో 25 రన్స్ తో "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" గా నిలిచాడు. ప్రెస్ టీమ్ సభ్యుల్లో అబ్దుల్ ఖాలిక్, ఆనంద్, నబీ, ఫాల్గున్, సతీష్, చందు, శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి.లు పాల్గొని బాగా ఆడి గెలిచారు.అటు బ్యాటింగ్,ఇటు బౌలింగ్ లో ప్రతిభను చాటి,మ్యాచ్ గెలిచారు.గెలిచిన ప్రెస్ జట్టుకు అందరూ అభినందించారు.

సీనియర్ జర్నలిస్టులు మొయినుద్దీన్, శ్రీకాంత్ రెడ్డి, అహ్మద్, సలీం, యూనుస్ లు విజేతలకు అభినందనలు తెలిపారు. నిర్వాహకులు ఖుద్దూస్, ఆఫ్రోజ్, లాలా, ఇమ్రాన్, ఖాలేద్, ఏక్బాల్ తెలిపిన వివరాల ప్రకారం, విజేతకు రూ.20,000, రన్నర్ కు రూ.10,000 క్యాష్ ప్రైజ్, ఒక టీమ్ కు 8 మంది ప్లేయర్స్, 7 ఓవర్ల మ్యాచ్, షార్ట్ బౌండరీ, గ్రామీణ క్రీడా కార్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఫిట్ నెస్, క్రీడా స్పూర్తి ని పెంచడమే లక్ష్యంగా ఈ నైట్ టోర్నీని ప్లాన్ చేశామని నిర్వాహకులు చెప్పారు. బాన్సువాడలో ఇక ప్రతి రాత్రి యువకుల్లో క్రికెట్ జోష్ నింప నుంది.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA