Banswada: దళారులపై చర్యలు తీసుకోండి: సీపీకి ఎమ్మెల్యే పోచారం!
Banswada: వర్నిలో వడ్ల వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్ సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు.
Banswada: దళారులపై చర్యలు తీసుకోండి: సీపీకి ఎమ్మెల్యే పోచారం!
Banswada: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు,రైతుల సమస్య పైఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద రైతులు ఎమ్మెల్యే తో మాట్లాడారు. వర్ని లో ఉన్న వరి ధాన్యం వ్యాపారులు సిండికేట్ గా మారి,తమను దోచుకుంటున్నారని తెలిపారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని,కొనుగోలు చేయటానికి బయటి వ్యాపారులకు రానివ్వడం లేదని తెలిపారు.
బయటి కొనుగోలుదారులు 500/- ఎక్కువ ధర పెట్టీ కొంటుంటే,వారికి భయపెట్టి వెళ్లగొట్టుతున్నారని రైతులు ఆరోపించారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే జిల్లా సీ పీ కి ఫోన్ ద్వారా మాట్లాడారు. రైతులకు ఇబ్బంది పెడుతున్న వడ్ల వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి లాభాలు పొందేవిధంగా చూడాలని అన్నారు.




