Banswada: ఆయుష్ ఆసుపత్రి మెగా హెల్త్ క్యాంప్ కరపత్రాలు ఆవిష్కరించిన పోచారం

Banswada: ఆయుష్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 14, 15 తేదీల్లో మెగా మాస్టర్ హెల్త్ క్యాంప్. కరపత్రాలను ఆవిష్కరించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.

SALEEM, BANSWADA
Published on: 10 Nov 2026 8:33 PM IST
Banswada
X

Banswada: ఆయుష్ ఆసుపత్రి మెగా హెల్త్ క్యాంప్ కరపత్రాలు ఆవిష్కరించిన పోచారం

బాన్స్వాడ: ఆయుష్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఆయుష్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఎస్. స్వేత ఆధ్వర్యంలో, తేదీలు 14-11-2026 మరియు 15-11-2026 న నిర్వహించనున్న రెండు రోజుల మెగా మాస్టర్ హెల్త్ క్యాంప్ కరపత్రాలను మాజీ శాసనసభాపతి, ముఖ్య వ్యవసాయ సలహాదారులు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఆయుష్ ఆసుపత్రి ఈ మెగా హెల్త్ క్యాంప్‌ను నిర్వహిస్తోందనీ వారు పేర్కొన్నారు. డా. ఎస్. స్వేత మాట్లాడుతూ రోగులకు ఆధునిక వైద్యసేవలు అందించి,ఆరోగ్యాలను కాపాడుతామని అన్నారు.ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA