Banswada: ఖతార్లో బాన్సువాడ ఉపాధ్యాయుడికి 'మిసాలీ ఉస్తాద్' అవార్డు
Banswada: ఖతార్ రాజధాని దోహాలో బాన్సువాడ పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు సాలెం బిన్ ఈసాకు ప్రతిష్టాత్మక 'ఆదర్శ ఉపాధ్యాయుడు' (మిసాలీ ఉస్తాద్) అవార్డు లభించింది.
Banswada: ఖతార్లో బాన్సువాడ ఉపాధ్యాయుడికి 'మిసాలీ ఉస్తాద్' అవార్డు
బాన్సువాడ: తెలంగాణ గడ్డపై పుట్టి, ఖతార్ గడ్డపై తెలుగు వెలుగును చాటిన బాన్సువాడలోని మదీనా కాలనీ కి చెందిన ఉపాధ్యాయుడు సాలెం బిన్ ఈసా కు అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కింది.
ఖతార్ లోని ప్రతిష్టాత్మక ఐడియల్ ఇండియన్ స్కూల్, దోహాలో నిర్వహించిన వార్షిక తహనీయతి మజ్లిస్ లో ఆయనకు మిసాలీ ఉస్తాద్ - ఆదర్శ ఉపాధ్యాయ అవార్డును ప్రదానం చేశారు.
ఖతార్ లోని 12 ప్రముఖ ఇండియన్ స్కూళ్ల నుండి ఒకే ఒక్క ఉత్తమ ఉపాధ్యాయుడిని ఎంపిక చేసి ఈ అవార్డు ఇస్తారు. ఈ ఏడాది ఆ అదృష్టం బాన్సువాడ పట్టణం లోని మదీనా కాలనీ కి చెందిన సాలెం బిన్ ఈసా కు ఈ అరుదైన గౌరవం దక్కింది.
భారత రాయబారి చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు.
దోహాలోని భారత రాయబార కార్యాలయం తరపున భారత రాయబారి డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి, ప్రథమ కార్యదర్శి హర్షీ పాండే చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. ఆయన బోధనా నైపుణ్యం, విద్యార్థులను తీర్చిదిద్దడంలో చూపిన అంకితభావానికి గాను ఈ గుర్తింపు లభించింది.
ఈ ఘనతను సాధించడం బాన్సువాడకే గర్వకారణమని, ఆయన మన ప్రాంతానికి చెందిన వాడు కావడం మనందరికీ గర్వకారణమని స్థానిక విద్యావేత్తలు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




